వ్యభిచాారానికి కేరాఫ్ రువాన్ థాయ్ స్పా సెంటర్లు

మసాజ్ పేరుతో గుట్టు చప్పుడు కాకుండా వ్యభిచార వ్యాపారం మూడు పూలు, ఆరు కాయలుగా విస్తరిస్తోంది. ఇప్పటికే హైదరాబాద్ నగరంలో వివిధ మార్గాల్లో వ్యభిచారం నిర్వహిస్తున్నప్పటికీ మసాజ్ సెంటర్లకు మాత్రం ఏమాత్రం వన్నె తగ్గడం లేదనే చెప్పుకోవాలి. టూరిస్ట్ వీసా, బిజినెస్ వీసాల పేరుతో థాయిలాండ్ నుండి అమ్మాయిలను తీసుకవచ్చి నగరం నడిబొడ్డున్న ఖరీదైన ప్రాంతాల్లో మసాజ్ సెంటర్ల పేరుతో జోరుగా వ్యభిచారం నిర్వహిస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే…  బంజారాహిల్స్ లోని రువాన్ థాయ్ స్పా పేరుతో నడుస్తున్న స్పా సెంటర్లో విదేశీ అమ్మాయిలతో హద్దు అదుపు లేకుండా వ్యభిచారం నిర్వహిస్తున్నారు. పేరుకు మసాజ్ అని విటులను రప్పించి వారికి కావాల్సిన సుఖాలను అందిస్తున్నారు నిర్వహకులు. ఇప్పటికే పలుమార్లు పోలీసులు దాడులు నిర్వహించినా… రువాన్ థాయ్ స్పా నిర్వాహకులు తమ ప్రవర్తనను మార్చుకోవడం లేదు మరియు నిబంధనలను ఉల్లంఘిస్తూనే ఉన్నారు.

వివరాల్లోకి వెళితే, బెంగళూరుకు చెందిన అబ్దుల్ ముఖిత్ బెంగళూరు నగరంలో 5 మసాజ్ పార్లర్లను నడుపుతున్నారు. బెంగళూరుతో పాటు హైదరాబాద్‌ను తన వ్యాపారానికి ఉత్తమమైన ప్రదేశంగా ఎంచుకున్నాడు. బంజారా హిల్స్, ఫిలింనగర్ మరియు మాదాపూర్‌లో వ్యక్తిగతంగా రువాన్, రెగో థాయ్ స్పాల పేరుతో వ్యభిచారానికి తెరలేపాడు. అంతే కాకుండా మరో భాగస్వామి బాషా ఖాన్‌తో కలిసి హైదరాబాద్‌లో మరిన్ని మసాజ్ పార్లర్‌లను ప్రారంభించాడు. ఇప్పుడు వారు నగరంలో అధికారికంగా 5 మసాజ్ పార్లర్లను నడుపుతున్నారు.

విశ్వసనీయ సమాచారం ప్రకారం వర్క్ వీసా, విసిటింగ్ విసాల మీద థాయిలాండ్ నుండి వచ్చిన అమ్మాయిలకు వల వేసి వారితో హైదరాబాద్, బెంగుళూరులో రహస్యంగా వ్యభిచారం నిర్వహిస్తున్నారని సమాచారం. అలాగే ఆ థాయ్ అమ్మాయిల దగ్గర నుండి వారి పాస్‌పోర్ట్‌లను స్వాధీనం చేసుకోని భయబ్రాంతులకు గురి చేసి డబ్బులు చెల్లించకుండా వారి పార్లర్‌లలో వ్యభిచారం నిర్వహించి లక్షల్లో డబ్బులు సంపాదిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. దీనికి సంబంధించి నిర్వాహకులపై గతంలో కేసులు కూడా నమోదయ్యాయి.

మసాజ్ పార్లర్లు మరియు స్పా సెంటర్లకు సంబంధించిన చట్టాలు మరియు మార్గదర్శకాలను పరిగణనలోకి తీసుకుని, పోలీసులు ఈ నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోని ఎలాంటి చట్టవిరుద్ధమైన కార్యకలాపాలు ఇకపై జరగకుండా చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Leave a Reply

%d