పవన్ పై విమర్శలు చంద్రబాబు ఫైర్

ఎప్పటిలాగానే పవన్ కళ్యాణ్ ఫై వైస్సార్సీపీ నేతలు మాటల దాడి మొదలుపెట్టారు. నిన్న శ్రీకాకుళంలో ఏర్పాటు చేసిన యువశక్తి సభలో పవన్ కళ్యాణ్..వైస్సార్సీపీ లోని కొంతమంది నేతలపై పలు కామెంట్స్ చేయడం తో..ఆ సభ పూర్తి అవ్వగానే ట్విట్టర్ లో వైస్సార్సీపీ నేతలు విమర్శలు చేయడం మొదలుపెట్టారు. ఇక ఈరోజు మీడియా ముందుకు వచ్చి విమర్శలు చేస్తున్నారు. ఈ క్రమంలో చంద్రబాబు వైస్సార్సీపీ నేతల విమర్శల ఫై ఆగ్రహం వ్యక్తం చేసారు. సంక్రాంతి వేడుకలకు నారావారిపల్లెకు వెళ్లిన చంద్రబాబు.. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. నిన్నటి సభలో పవన్ కల్యాణ్ ఆయన చెప్పాలనుకున్నది స్పష్టంగా చెప్పారని అన్నారు. వైస్సార్సీపీ నేతలు పవన్ ను ఎందుకు తిడుతున్నారని, వారికి ఎందుకంత భయం, ఎందుకు అంత పిరికితనమని ప్రశ్నించారు. అధికారంతో వచ్చిన అహంకారం మంచిది కాదని అన్నారు. వచ్చే ఎన్నికల్లో వైస్సార్సీపీ ప్రజలు బుద్ధి చెప్పడం ఖాయం అన్నారు.

Leave a Reply

%d