సంగారెడ్డికి అమిత్ షా

కేంద్ర హోంమంత్రి అమిత్​షా శుక్రవారం సంగారెడ్డికి రానున్నారు. శంషాబాద్ ఎయిర్​పోర్ట్​నుంచి నేరుగా సంగారెడ్డికి చేరుకుంటారు. అక్కడ బీజేపీ జిల్లా ఆఫీస్​ను ప్రారంభిస్తారు. అనంతరం అక్కడి నుంచే వర్చువల్​గా భూపాలపల్లి, వరంగల్, జనగామ, మహబూబ్ నగర్, ఏపీలోని అనంతపూర్, చిత్తూరు జిల్లాల ఆఫీసులనూ ఓపెన్​ చేస్తారని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. అలాగే, భూపాలపల్లిలో  డీకే అరుణ, వరంగల్ లో  ఈటల రాజేందర్, జనగామ లో  కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి,  బూర నర్సయ్య గౌడ్,  మహబూబాబాద్ లో  గరికపాటి మోహన్ రావు,  రవీంద్ర నాయక్ ముఖ్య అతిథులుగా పాల్గొంటారని ఆయన తెలిపారు. అదే రోజు సాయంత్రం శంషాబాద్ లో బీజేపీ  రాష్ట్ర పదాధికారులు, జిల్లా అధ్యక్షులు, జిల్లా ఇన్​చార్జ్​ల సమావేశంలో అమిత్​షా పాల్గొని ప్రసంగిస్తారని చెప్పారు. ఈ మీటింగ్ లో బీజేపీ నేషనల్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా, రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఓబీసీ మోర్చా నేష నల్ ప్రెసిడెంట్ లక్ష్మణ్, రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జ్ తరుణ్ చుగ్, సునీల్ బన్సల్, అర వింద్ మీనన్​లతో పాటు పలువురు నేతలు
పాల్గొంటారని ఆయన పేర్కొన్నారు.

Leave a Reply

%d