ధరిపల్లిలో ఘనంగా శివాజీ జయంతి

ఛత్రపతి శివాజీ జయంతిని ఘనంగా నిర్వహించారు మెదక్ జిల్లా ధరిపల్లి గ్రామ యువకులు.  శివాజీ యూత్ ఆధ్వర్యంలో గ్రామంలో ర్యాలీ చేపట్టి తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఈ సందర్బంగా యువజన సంఘాల నాయకులు మాట్లాడుతూ శివాజీ సూచించిన అడుగుజాడల్లో యువత ముందుకు నడవాలని పిలుపునిచ్చారు. యువత సామాజిక అంశాల మీద దృష్టి పెట్టినప్పుడే శివాజీ ఆచరించిన భావాజాలన్ని ముందుకు తీసుకెళ్తారని పేర్కొన్నారు. ఇటీవల దేశంలో వస్తున్న అనేక మార్పులకు హిందు సమాజం అండంగా నిలవడం వల్లే సాధ్యమైందన్నారు. కాగా హైదరాబాద్ లో ర్యాలీ నిర్వహించడానికి ఆటంకాలు కలిగిన హై కోర్టు అనుమతితో విజయవంతంగా ర్యాలీ సాగింది. హిందూ సంఘాల ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహణకు హైకోర్టు శనివారం అనుమతి మంజూరు చేసింది. షేక్‌పేట నుంచి యూసుఫ్ గూడ వరకు దాదాపు 10 కిలోమీటర్ల మేర ర్యాలీ నిర్వహణకు అనుమతి ఇవ్వాలని హిందూ సంఘాలు పోలీసులకు దరఖాస్తు చేసుకున్నాయి. ఈ దరఖాస్తును పోలీసులు తిరస్కరించడంతో నిర్వాహకుడు ఏవీ ప్రశాంత్‌ హైకోర్టులో హౌస్‌మోషన్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన జస్టిస్‌ టీ. వినోద్‌కుమార్‌ ధర్మాసనం ర్యాలీకి పలు షరతులతో అనుమతి మంజూరు చేసింది.

Leave a Reply

%d