రోడ్డుపై హిజ్రాతో పూజలు

ఇటీవల దేశ వ్యాప్తంగా వరుస రోడ్డు ప్రమాదాలు సంభవిస్తున్నాయి. డ్రైవర్ల నిర్లక్ష్యం, మద్య సేవించి వాహనాలు నడపడం, అతి వేగం.. ఎక్కువగా ఇలాంటి కారణాలతో ప్రమాదాలు జరుగుతున్నాయని ట్రాఫిక్ అధికారులు అంటున్నారు. ఓ రోడ్డు పై ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నాయని ట్రాఫిక్ పోలీస్ అధికారి వినూత్నంగా ప్రయత్నించాడు.. కానీ అది కాస్త బెడిసి కొట్టింది. ఈ సంఘటన చైన్నై లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..

ఒకే రోడ్డు పై వరుసగా ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో ఓ ట్రాఫిక్ పోలీస్ తీసుకున్న నిర్ణయం ఆయన ఉద్యోగానికి ఎసరు పెట్టింది. ప్రపంచం టెక్నాలజీ రంగంలో ఎంత ముందుకు దూసుకు వెళ్తున్నా.. ఇప్పటికీ మూఢ నమ్మకాలు నమ్మేవారు ఉన్నారు. ఓ ట్రాఫీక్ పోలీస్ మూఢ నమ్మకాలు నమ్ముతూ ఎక్కువ ప్రమాదాలు రోడ్డు మీద జరుగుతున్న రోడ్డుపై ఓక హిజ్రాతో పూజలు చేయించాడు. తద్వారా దుష్ట శక్తులు కోల్పోతాయని భావించాడు. హిజ్రాతో రోడ్డు పై పూజలు చేయించడంతో అటుగా వెళ్తున్న ప్రజలు కంగారుపడ్డారు. ఈ విషయం కాస్త ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లింది. దీంతో ఆ ట్రాఫిక్ పోలీస్ అధికారిపై చర్యలు తీసుకున్నారు.

చెన్నైలోని వనాగారం, మధురవాయిల్ సమీపంలో రహదారిలో ఇటీవల వరుస ప్రమాదాలు జరుగుతున్నాయి. దీంతో ఇక్కడ ట్రాఫిక్ ఎస్‌ఐ పళని ఓ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఆ రోడ్డుకు దిష్టి తీసేస్తే దుష్ట శక్తులు దూరమైతాయని శుక్రవారం ఉదయం ఒక హిజ్రాను పోలీస్ వాహనంలో అక్కడికి రప్పించాడు. ప్రమాదాలు జరిగే రోడ్డు పై ఆ హిజ్రా గుమ్మడికాయ, నిమ్మకాయలతో దిష్టితీసింది. తర్వాత వాటిని రోడ్డు పై కొట్టి పసుపు, కుంకుమ చల్లారు. దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అది కాస్త ఉన్నతాధికారుల దృష్టిలో పడటంతో ట్రాఫిక్ ఎస్ఐ పై చర్యలు తీసుకున్నారు.

ఈ విషయంపై ట్రాఫిక్ అడిషనల్ కమిషనర్ కపిల్ కుమార్ శరత్కర్  స్పందించారు. సదరు ట్రాఫీక్ పోలీస్ తన వృత్తికి వ్యతిరేకంగా వ్యవహరించడానని.. తన వ్యక్తిగత నమ్మకంతో  ఇలాంటి చర్యలకు పాల్పపడటం సబబు కాదని అన్నారు. రోడ్డు ప్రమాదాలకు దారి తీసే ప్రదేశాలలో శాస్తీయంగా విశ్లేషించి నివారణ చర్యలు చేపట్టకుండా.. దుష్టశక్తిని తరిమే విధంగా ఇలాంటి పూజలు చేయడం తప్పు అని పేర్కోన్నాడు. ట్రాఫిక్ ఎస్ఐ పళనిని  విధుల నుంచి తప్పించడంతో పాటు కంట్రోల్ రూమ్ కు రిపోర్ట్ చేయాలని తనని ఆదేశించినట్లు తెలిపారు.

Leave a Reply

%d