ఆమె మరణించి ఐదుగురిని బ్రతికించింది

తమ కుటుంబంలోని వ్యక్తిని కొల్పోతూ కూడా మరో ఐదుగురిని బ్రతికించాలని ఆ కుటంబం తీసుకున్న నిర్ణయాన్ని ప్రతి ఒక్కరూ ప్రశంసిస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే… కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం వెదరుగుట్ట గ్రామానికి చెందిన పెంచుల సరోజ (55) వ్యవసాయ కుటుబంబానికి చెందినది. శనివారం రోజున తలలో విపరీతమైన నొప్పి రావడంతో వెంటనే కరీంనగర్ లోని స్థానికి ఆస్పత్రికి తీసుకవెళ్తారు. మెదడులో రక్తం గడ్డకట్టడంతో మెరుగైన వైద్యం కోసం సికింద్రాబాద్ లోని కిమ్స్ ఆస్పత్రికి తరలించారు. ఆమెను రక్షించడానికి వైద్యులు ఎంతో శ్ర‌మించారు. కానీ దురుదృష్ట‌వశాస్తూ ఆదివారం ఉదయం రోజున బ్రెయిన్ డెడ్ అయ్యారు.

ఆ త‌ర్వాత అవ‌య‌వ‌దానంపై కిమ్స్ ఆస్పత్రిలోని అవయవదాన సమన్వయ కర్తలు, మృతురాలి కుటుంబ సభ్యులకు, బంధువుల‌కు, అవ‌గాహ‌న‌ క‌ల్పించారు. అనంతరం వారి అంగీకారంతో కళ్ళు, కిడ్నీలు, లివర్ దానం చేశారు. చ‌నిపోతూ మ‌రో ఐదుగురి జీవితాల్లో వెలుగులు నింపింనందుకు గ‌ర్వంగా ఉంద‌ని కుటుంబ స‌భ్యులు తెలిపారు. మృతురాలికి భర్త కొమరయ్య, ఇద్దరు కుమారులు దామోదర్, రమేష్, కుమార్తె అనూష ఉన్నారు. ఒక కుమారుడు పోలీస్ విభాగంలో విధులు నిర్వహిస్తున్నారు. పుట్టెడు దు:ఖంలో ఉన్నప్పటికీ… వారు తీసుకున్న నిర్ణయానికి తోటి ఉద్యోగులు అతన్ని అభినంధించారు. ప్రజల్లో అవయవదానంపై మరింత అవగాహన రావాలని కోరారు. జీవ‌న్‌ధాన్ ఆధ్వ‌ర్యంలో ఏర్పాటు చేసిన గ్రీన్ ఛానెల్ ద్వారా అవ‌స‌రం ఉన్న‌చోటికి అవయవాలను తరలించారని జీవన్ దాన్ కమిటీ సభ్యులు తెలిపారు.

Leave a Reply

%d