ముఖ్యమంత్రి కేసీఆర్ త్వరగా కోలుకోవాలని గవర్నర్ తమిళిసై ఆకాంక్షించారు. స్వల్ప అస్వస్థత తో సీఎం గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో వెళ్లారన్న విషయం తెలుసుకున్నగవర్నర్ కేసీఆర్ త్వరగా కోలుకోవాలని ట్విటర్ వేదికగా పేర్కొన్నారు. ఈరోజు ఉదయ గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రికి వచ్చిన ముఖ్యమంత్రికి ఏఐజీ ఛైర్మన్ నాగేశ్వర్‌రెడ్డి ఆధ్వర్యంలో వైద్య నిపుణులు ఎండోస్కోపి, సిటీ స్కాన్ చేశారు. కడుపులో చిన్న అల్సర్ ఉన్నట్టు గుర్తించారు. ముఖ్యమంత్రికి మిగతా వైద్య పరీక్షలన్నీ సాధారణంగానే ఉన్నాయని తెలిపారు. సీఎం సుమారు 7 గంటల పాటు ఆస్పత్రిలోనే ఉన్నారు. రాత్రి 7 గంటలకు ఆస్పత్రిని నుంచి ప్రగతిభవన్‌కు వెళ్లారు.
సీఎం కేసీఆర్ త్వరగా కోలుకోవాలి – గవర్నర్
