వారితో కేసీఆర్ అందుకే సమావేశమవుతున్నాడా ?

కర్నాటక ఎన్నికల ఫలితం తెలంగాణ మీద బాగానే పడుతుందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు సీఎం కేసీఆర్. ఈ నేపథ్యంలోనే  తెలంగాణ భ‌వ‌న్‌లో మే 17వ తేదీన బీఆర్ఎస్ లెజిస్లేటివ్, పార్లమెంట‌రీ పార్టీ స‌మావేశం ఏర్పాటు చేశారు. మ‌ధ్యాహ్నం 2 గంట‌ల‌కు సీఎం కేసీఆర్ అధ్యక్షత‌న ఈ స‌మావేశం కొన‌సాగ‌నుంది. ఈ స‌మావేశానికి పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజ‌రు కానున్నారు.

For More News Click: https://eenadunews.co.in/

కర్నాటక ఎన్నికలతో పాటు రాష్ట్రంలోని ప్రస్తుత రాజకీయ పరిణామాలపైనా చర్చించనున్నారు. మరోవైపు.. బీఆర్ఎస్ పార్టీ బలోపేతంపై చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కర్నాటక ఎన్నికల ఫలితాల ఎఫెక్ట్.. బీఆర్ఎస్ పార్టీపై పడుతుందనే నడుస్తున్న చర్చపైనా మాట్లాడే అవకాశం ఉంది.

Leave a Reply

%d bloggers like this: