మెడలో లక్ష్మీ దేవి లాకెట్ ఆపై పొట్టి బట్టలతో ర్యాంప్ వాక్

హీరోయిన్ తాప్సీపై మ‌ధ్య‌ప్ర‌దేశ్ ఇండోర్ లోని ఛ‌త్రిపుర పోలీస్ స్టేష‌న్ లో కేసు న‌మోదైంది. ఇటీవల ముంబైలో జరిగిన ఓ ఫ్యాషన్ షో లో తాప్సీ తన మెడలో లక్ష్మీ దేవి లాకెట్ ను ధరించింది. దీనిపై కొందరు అభ్యంతరం వ్యక్తం చేశారు. మధ్యప్రదేశ్ ఇండోర్ లోని బీజేపీ ఎమ్మెల్యే మాలినీ గౌర్ కుమారుడు ఏకలవ్య గౌర్ తాప్సీపై పీఎస్ లో ఫిర్యాదు చేశారు. ఆమె తమ మనోభావాలను దెబ్బతీశారని ఏకలవ్య గౌర్ ఆరోపించారు. మార్చి 12న ముంబైలో లాక్ మీ ఫ్యాషన్ వీక్2023 ఫ్యాషన్ షో జరిగింది. ఈ షోలో తాప్సీ ర్యాంప్ వాక్ చేసింది. ఆ షోలో తాప్సీ తన మెడలో హిందువులు ఆరాధించే లక్ష్మీ దేవి లాకెట్ ను ధరించింది ర్యాంప్ వాక్ చేసింది. ప్రైవేటు పార్ట్స్ కనపడేలా లక్ష్మీదేవి లాకెట్ ధరించి ర్యాంప్ వాక్ చేయడంపై హింధూసంఘాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. హిందువుల మనోభావాలకు గాయం అయ్యేలా వ్య‌వ‌హరించింద‌ని ఆమెపై పెద్ద ఎత్తున విమర్షలు వచ్చాయి. కాగా గ‌తంలో కూడా టాలీవుడ్ ద‌ర్శ‌కుల‌పై తాప్సీ చేసిన కామెంట్స్ నెట్టింట వైర‌ల్ అయ్యాయి. హీరోయిన్‌గా లైఫ్ ఇచ్చిన సౌత్‌పై తాప్సీ కామెంట్స్ చేయ‌టంతో ఆమెపై విమ‌ర్శ‌లు వెల్లువెత్తాయి. తెలుగులో ‘ఝుమ్మంది నాదం’ మూవీతో  హీరోయిన్ గా తాప్సీ ప‌రిచ‌యం అయ్యారు. ఆ తర్వాత మిస్టర్ పర్ఫెక్ట్, వీర, గుండెల్లో గోదారి వంటి సినిమాలు చేసి పాపులర్ అయ్యింది. తెలుగులోనే కాకుండా తమిళం, హిందీ భాషల్లో కూడా తాప్సీకి వరుస అవకాశాలు వచ్చాయి. ప్రస్తుతం ఆమె వెబ్ సిరీస్ ల‌ల్లో నటిస్తోంది.

Leave a Reply

%d