మాస్క్ మళ్లీ పెట్టాల్సిందే

ఈనాడు హెల్త్ బ్యూరో:

కరోనా మహమ్మారి ముప్పు మళ్లీ పెరుగుతున్నది. ఇటీవల కొద్దిరోజులుగా వరుసగా రోజువారీ కేసులు భారీగా పెరుగుతున్నాయి. 14 రాష్ట్రాల్లోని 29 జిల్లాల్లో ఇన్‌ఫెక్షన్‌ రేటు 10శాతం దాటింది. అదే సమయంలో 59 జిల్లాల్లో వీక్లీ పాజిటివిటీ రేటు 5-10 మధ్య ఉన్నది. గత వారంలో అనేక జిల్లాల్లో 40శాతానికిపైగా నమూనాలు పాజిటివ్‌గా తేలాయి. ఈ క్రమంలో ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌ మహమ్మారిని నివారించేందుకు రద్దీ ప్రాంతాల్లో మాస్క్‌లను తప్పనిసరి చేయాలని సూచించింది.0 దేశంలో కరోనా కేసులు సంఖ్య నెమ్మదిగా పెరుగుతున్నాయి. గత కొన్ని రోజుల నుంచి వెయ్యికి పైగా కేసులు నమోదు అవుతున్నాయి. కొన్నాళ్ల వరకు కేసుల సంఖ్య కేవలం వందల్లోనే ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితి మారుతోంది. తాజాగా 5 నెలల గరిష్టానికి రోజూవారీ కేసుల సంఖ్య పెరిగింది. గడిచిన 24 గంటల్లో 1,890 కొత్త కరోనా కేసులు నమోదు అయ్యాయి. మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాల్లో ఒక్కొక్కరు, కేరళలో ముగ్గురు మరణించారు.

చివరిసారిగా గతేడాది ఒకే రోజు 2,208 కేసులు నమోదు కాగా.. దాదాపుగా 149 రోజుల తర్వాత 1,890 కేసులు వెలుగులోకి వచ్చాయి. ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 9,433గా ఉంది. డైలీ పాజిటివిటీ రేట్ 1.56 శాతంగా నమోదు అయింది. వీక్లీ పాజిటివిటీ రేట్ 1.29 శాతంగా ఉంది. దేశంలో కరోనా ప్రారంభం అయినప్పటి నుంచి ఇప్పటి వరకు 4.47 కోట్లు(4,47,04,147)గా కేసులు నమోదు అయ్యాయి. వ్యాధి నుంచి కోలుకున్న వారి సంఖ్య ,41,63,883కి చేరుకోగా, కేసు మరణాల రేటు 1.19 శాతంగా నమోదైంది. ప్రభుత్వం వ్యాక్సిన్ డ్రైవ్ ద్వారా 220.65 కోట్ల కోవిడ్ వ్యాక్సిన్లు అందించింది.

Leave a Reply

%d bloggers like this: