టీపీసీసీ అధక్ష పదవి నుంచి రేవంత్‌రెడ్డిని తొలగించాలి – దాసోజు శ్రవణ్ కుమార్

టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి అనుచిత వ్యాఖ్యలపై బీఆర్‌ఎస్‌ నేత దాసోజు శ్రవణ్‌ ఫైర్‌ అయ్యారు. రైతులకు మూడు గంటల కరెంట్‌ చాలని అవమానించడం, రాష్ట్ర ప్రజలను కించపరిచేలా కులాల పేరుతో దూషిస్తున్న రేవంత్‌రెడ్డి అహంకారంపై కాంగ్రెస్‌ అధిష్ఠానానికి బహిరంగ లేఖ రాశారు. రేవంత్ తన రాజకీయ ప్రసంగాలలో తోటి మనుష్యులు అనే కనీస ఇంగితం లేకుండా, ట్రాన్స్‌జెండర్ కమ్యూనిటీని, బీసీ కులాలను కించపరిచి, అవమానించేలా మాట్లాడినందుకు చట్ట ప్రకారం తగిన క్రిమినల్ కేసులు నమోదు చేయాలని నేను తగిన పోలీసు అధికారులకు, తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌కు, తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ లకు జాతీయ మానవ హక్కుల సంఘానికి, జాతీయ ఓబీసీ కమిషన్ కు విజ్ఞప్తి చేస్తున్నాను. బాధ్యతారహితమైన రేవంత్ రెడ్డి వంటి రాజకీయ నాయకుడ్ని సంఘం నుంచి బహిష్కరించాలి అని కోరుతున్నాను. అదేవిధంగా అమాయక ప్రజలను పేదలను చట్ట వ్యతిరేకంగా అవమానిస్తూ, వారి ఆత్మ గౌరవాన్ని దెబ్బదీస్తున్న రేవంత్ పార్లమెంటు సభ్యత్వం కూడా రద్దు చేయాలని విజ్ఞప్తి.

 

Leave a Reply

%d