పోలీస్ స్టేషన్ మరుగుదొడ్డిలో మృతదేహం

పోలీస్ స్టేషన్ మరుగుదొడ్డిలో మృతదేహం ఉన్న ఘటన తిరుపతి జిల్లా పుత్తూరు అర్బన్ పోలీస్ స్టేషన్ లో వెలుగులోకి వచ్చింది. పోలీసు స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదుదారులు, సందర్శకుల కోసం పోలీస్ స్టేషన్ ఆవరణ లో మరుగుదొడ్డి నిర్మించారు. అయితే ఆ మరుగుదొడ్డి నుండి దుర్వాసన రావడంతో పోలీసులు డోర్ ఓపెన్ చేసి చూడగా అందులో మృతదేహం కనిపించింది. శరీరం బాగా కుళ్లిపోవడం తో.. చనిపోయి 2 లేదా 3 రోజులై ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతి చెందిన వ్యక్తికి సుమారు 45 ఏళ్ల వయసు ఉండవచ్చని భావిస్తున్నారు. పోలీస్ స్టేషన్ కు వచ్చిన వ్యక్తినా లేక ఇతరులెవరైనా మృతి చెంది ఉంటారా అన్న దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

Leave a Reply

%d