ఈ సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ తలరాత మారడం లేదు. వరుసగా మూడో మ్యాచ్‌లోనూ ఆ జట్టుకు ఓటమి తప్పలేదు. శనివారం జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ 57 పరుగుల తేడాతో ఢిల్లీని చిత్తుచేసింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన రాజస్థాన్.. ఓపెనర్లు యశస్వీ జైస్వాల్ (31 బంతుల్లో 11 ఫోర్లు, సిక్సర్‌తో 60), బట్లర్ (51 బంతుల్లో 11 ఫోర్లు, సిక్సర్‌తో 79) మెరుపు ఇన్నింగ్స్ ఆడడంతో నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 199 పరుగుల భారీస్కోరు సాధించింది. ముకేశ్‌కు 2 వికెట్లు దక్కాయి. భారీ ఛేదనలో కెప్టెన్ వార్నర్ (55 బంతుల్లో 7 ఫోర్లతో 65), లలిత్ యాదవ్ (24 బంతుల్లో 5 ఫోర్లతో 38) మినహా అంతా విఫలమవడంతో ఢిల్లీ 20 ఓవర్లలో 142/9 స్కోరుకే పరిమితమై హ్యాట్రిక్ పరాజయాన్ని మూటగట్టుకుంది. బౌల్ట్, చాహల్ చెరో 3 వికెట్లు, అశ్విన్ 2 వికెట్లు తీశాడు. యశస్వీ జైస్వాల్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు.
ఢిల్లీ హ్యాట్రిక్ ఓటమి
