జిమ్‌లో 23 ఏళ్ల కుర్రాడితో 42 ఏళ్ల మహిళ.. చనువుతో ఇంటికొచ్చి మరీ

ఇటీవల చోటుచేసుకుంటున్న హత్యల వెనుక కారణాలు ఇవని కచ్చితంగా తెలియడం లేదు. బాధితులు ఇరుగు పొరుగు, తెలిసిన వ్యక్తులే చేతుల్లోనే హతమౌతున్నారు. వివాహేతర సంబంధాలు, ఆర్థిక కలహాలు, ఆస్తి పరమైన వివాదాలు, ప్రేమ వ్యవహారం వంటివి చాలా హత్యల్లో కారణాలుగా మారుతున్నాయి. అయితే కొన్నింటిలో మాత్రం ఆ హత్య ఎందుకు చేశారన్న విషయం బయటకు పొక్కడం లేదు. బాధితులతో పాటు వారిని హత్య చేసిన వ్యక్తులు ఆత్మహత్యకు పాల్పడటంతో.. ఈ ఘాతుకానికి అసలైన కారణం ఏంటో తెలియడం లేదు. ఢిల్లీలోని దబ్రీ ప్రాంతంలో దారుణ హత్యకు గురైన మహిళ విషయంలోనూ ఇదే జరిగింది.

పొరిగింట్లో ఉన్న ఓ మహిళను ఆమె ఇంటి ముందే గన్‌తో కాల్చి చంపాడో ఓ యువకుడు. అనంతరం తన ఇంటికి వెళ్లి కాల్చుకుని చనిపోయాడు. ఈ దారుణ ఘటన ఢిల్లీలోని దబ్రీ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. మృతులు రేణు గోయల్ (42), ఆశిష్ (23)లుగా గుర్తించారు. వీరిద్దరికీ 2-3 ఏళ్ల నుండి పరియం ఉన్నట్లు గుర్తించారు. వీరికి జిమ్‌లో పరిచయం ఏర్పడి.. చనువు పెరిగినట్లు తేలింది. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం.. రేణు గోయల్, తన భర్తతో కలిసి దబ్రీ ప్రాంతలో నివసిస్తోంది. గోయల్ భర్త స్థానికంగా బిల్డర్ అని తెలుస్తోంది. ఆమెకు ముగ్గురు పిల్లలు.

అయితే ఏం అయ్యిందో తెలియదు.. గురువారం రాత్రి తన ఫ్రెండ్స్‌ను కలిసేందుకు ఇంటి బయటకు వచ్చిన రేణుపై పాయింట్ బ్లాంక్ లో గన్ పెట్టి పేల్చాడు. ఆ సమయంలో ఆమె ఒంటరిగా ఉంది. ఆ శబ్దాలకు ఉలిక్కి పడ్డ స్థానికులు బయటకు వచ్చేసరికి ఆశిష్.. చేతిలో గన్ పట్టుకుని తన ఇంటిలోకి వెళుతుండటం చూశారు. వెంటనే భర్త ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లగా.. ఆమె చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. అయితే స్థానికులు.. ఆశిష్ ఇంటికి వెళ్లి చూడగా.. అదే ఫిస్టల్ తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు గుర్తించారు. ఈ విషయం పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు.. వ్యక్తిగత వివాదానికి సంబంధించిన కేసుగా నమోదు చేసి, అన్ని కోణాల్లో విచారిస్తామని అన్నారు.

Leave a Reply

%d