కవిత ఢిల్లీ లిక్కర్ స్కామ్ అంశం సీఎం కేసీఆర్ తలనొప్పిగా మారింది. మూడోసారి తెలంగాణలో అధికారంలోకి వచ్చి చరిత్ర మారుద్దాం అనుకుంటున్న ఆయనకు ఈ విషయంతో నిద్రపట్టనీయడం లేదు. దీంతో ఎప్పటికప్పుడు లీగల్ టీంతో చర్చలు జరుపుతున్నారు. కేసీఆర్ కాకుండా మంత్రులు హారీష్ రావు, కేటీఆర్ కూడా అన్ని పనులు వదిలి పెట్టుకొని ఈ అంశం మీదే కూర్చకున్నారు.
ఈనెల 16న మరోసారి ఈడీ విచారణ సందర్భంగా ఎలాంటి పరిణామాలు చోటుచేసుకోవచ్చు? అనే దానిపై ఆరా తీశారు. ఆదివారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు మంత్రి హరీశ్‌రావు, ప్లానింగ్‌బోర్డు వైస్‌చైర్మన్ వినోద్ కుమార్‌తో కలిసి కేసీఆర్ న్యాయనిపుణులతో సమావేశమయ్యారు. ఈడీ, సీబీఐ కేసుల విచారణ అనుభవం ఉన్న కొందరితో ఈ సందర్భంగా ఫోన్‌లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు.
మధ్యాహ్నం తర్వాత ప్రగతి భవన్‌కు ఎమ్మెల్సీ కవిత చేరుకున్నారు. ఈ భేటీలో ఆమె కూడా పాల్గొన్నారు. శనివారం ఉదయం నుంచి రాత్రి వరకు ఎనిమిది గంటలకు పైగా సుదీర్ఘ విచారణ సందర్భంగా ఈడీ అడిగిన ప్రశ్నలు, ఆ సమయంలో వాళ్లు ఎగ్జిబిట్చేసిన సాక్ష్యాలు, ఆధారాలు.. ఈ కేసులో ఇప్పటి వరకు అరెస్ట్ చేసిన వారు ఇచ్చిన స్టేట్మెంట్లు, వాటిలో కవితకు వ్యతిరేకంగా ఏమైనా అంశాలు ఉన్నాయా అనే దానిపై కవితను వివరాలు అడిగి కేసీఆర్ తెలుసుకున్నారు. దీనికి కొనసాగింపుగా ఈనెల 16న విచారణ సందర్భంగా ఏయే అంశాలపై ప్రశ్నలు సంధించవచ్చు? వాటికి ఎలాంటి సమాధానాలు చెప్పాలి? అనే దానిపై చర్చించారు.
ప్రగతి భవన్‌కు వెళ్లి తన తండ్రి, సీఎం కేసీఆర్‌తో అరగంటకు పైగా భేటీ అయ్యారు. ఈడీ విచారణలో ఏయే వివరాలు అడిగారు? వారికి ఎలాంటి సమాధానాలు ఇచ్చావు? విచారణ సందర్భంగా ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి? అనే వివరాలపై కేసీఆర్ ఆరా తీశారు. తర్వాత తన తల్లి శోభతో కాసేపు మాట్లాడిన కవిత.. కుటుంబ సభ్యులతో కలిసి రాత్రి ఒంటి గంట సమయంలో బంజారాహిల్స్‌లోని తన నివాసానికి వెళ్లిపోయారు. అంతకుముందే హరీశ్ రావు.. కోకాపేటలోని తన నివాసానికి వెళ్లిపోయారు. ఆదివారం ఉదయం ప్రగతి భవన్ కు హరీశ్ రావు, వినోద్ కుమార్ వచ్చారు. అప్పటికే అక్కడికి చేరుకున్న న్యాయ నిపుణులతో ఈడీ విచారణపై చర్చించారు.
ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఈడీ, సీబీఐ వద్ద ఏం సాక్ష్యాలు ఉన్నాయి? అందులో కవితకు వ్యతిరేకంగా ఉన్న ఆధారాలేవి? లిక్కర్ స్కామ్‌లో తాను కవితకు బినామీ అని ఇచ్చిన స్టేట్‌మెంట్‌ను విత్ డ్రా చేసుకునేందుకు అరుణ్ రామచంద్ర పిళ్లై దాఖలు చేసిన పిటిషన్ పరిస్థితేంటి? లీగల్‌గా ఈడీ, సీబీఐని నిలువరించేందుకు ఏమైనా ఆప్షన్స్ ఉన్నాయా? అనే వాటిపై కేసీఆర్ సమాచారం సేకరించారు. లిక్కర్‌స్కామ్‌లో కవితను అరెస్ట్ చేసే పరిస్థితి వస్తుందా? దాన్ని అడ్డుకునేందుకు లీగల్‌గా తమ ముందు ఉన్న ఆప్షన్స్ ఏవి? అనే వివరాలను ఎక్స్‌పర్టులను అడిగి తెలుసుకున్నారు. ఢిల్లీ లిక్కర్‌స్కామ్‌లో ఇప్పటి వరకు జరిగిన లీగల్ప్రొసీడింగ్స్.. ఈడీ, సీబీఐ నిందితులపై నమోదు చేసిన చార్జిషీట్లు, రిమాండ్ రిపోర్టులు.. వాటిలో కవితకు సంబంధించిన ప్రస్తావన.. ఆమెకు వ్యతిరేకంగా దర్యాప్తు సంస్థలు చూపిస్తున్న ఆధారాలతో తనకు బ్రీఫ్నోట్సమర్పించాలని న్యాయ నిపుణులకు కేసీఆర్ సూచించినట్టు తెలిసింది. కవిత విచారణ ప్రభావం ఎలా ఉంది? ఇంటెలిజెన్స్ సహా ఇతర నివేదికలు ఎలా ఉన్నాయి? అనే దానిపైనా కేసీఆర్విడిగా ఆరా తీసినట్టు తెలిసింది. దీని ఆధారంగా కేంద్రంలోని బీజేపీ సర్కారును పొలిటికల్‌గా కార్నర్చేయడంపైనా కేసీఆర్ సమాలోచనలు చేస్తున్నారు. దీనిపై త్వరలోనే పార్టీ క్యాడర్‌కు ఆదేశాలు ఇచ్చే అవకాశమున్నట్టు తెలిసింది.