ఢిల్లీ మద్యం కుంభకోణంలో కీలకపాత్ర పోషించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ, సీఎం కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత శనివారం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణకు హాజరయ్యారు. మూడురోజుల క్రితం అందిన సమన్ల మేరకు శనివారం ఉదయం 11 గంటలకు ఏపీజే అబ్దుల్ కలాం రోడ్‌లో విద్యుత్ లేన్‌లో ఉన్న ప్రవర్తన్ భవన్‌లో ఈడీ ప్రధాన కార్యాలయానికి వచ్చారు. బీఆర్‌ఎస్, భారత్ జాగృతి కార్యకర్తల నిరసనల నడుమ హాజరైన కవితను ఈడీ అధికారులు దాదాపు తొమ్మిది గంటలపాటు ప్రశ్నించారు. రాత్రి 8 గంటల వరకు విచారించిన ఈడీ అధికారులు.. లిక్కర్ స్కామ్‌కు సంబంధించి ఆమెపై ప్రశ్నల వర్షం కురిపించినట్లు తెలిసింది.
ఏమేం ప్రశ్నించారు…?
1. ఢిల్లీ మద్యం పాలసీలో మార్పులు చేసింది మీరేనా..?
2. ఈ మార్పులు చేర్పులు వెనుక ఎవరెవరి పాత్ర ఉంది.. మనీష్ సిసోడియాతో (Manish Sisodia) పరిచయం ఎలా ఏర్పడింది..!?
3. ఢిల్లీ గవర్నమెంట్‌కు (Delhi Govt)- సౌత్‌గ్రూప్‌నకు మధ్యవర్తి మీరేనా..?
4. ఢిల్లీ మద్యం వ్యాపారంతో మీకున్న సంబంధమేంటి..?
5. లిక్కర్ స్కామ్‌లో మీ పాత్ర ఉందా.. లేదా..?
6. అరుణ్ రామచంద్ర పిళ్లై మీకు బినామీనా కాదా..?
7. మీ ప్రతినిధని పిళ్లై చెప్పిన దాంట్లో నిజమెంత..?
8. పిళ్లైకు.. మీకు (కవితకు) మధ్య ఆర్థిక లావాదేవీలు ఏమైనా జరిగాయా..?
9. రామచంద్రతో వ్యాపారం చేస్తే నాతో చేసినట్లే అని మీరు చెప్పలేదా..?
10. సౌత్‌గ్రూప్‌తో మీకున్న సంబంధాలేంటి..?
11. ఛార్టెడ్ ఫ్లైట్‌లో వెళ్లి రూ. 130 కోట్లు లంచం ఇచ్చారా..?
12. 130 కోట్లు డబ్బు ఎక్కడ్నుంచి వచ్చింది.. ఎవరిచ్చారు..?
13. ఛార్డెడ్ ఫ్లైట్ మీకు ఎవరు సమకూర్చారు..?
14. ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని ఎప్పుడైనా కలిశారా..?
15. ఫేస్‌టైమ్‌లో మీరు సమీర్ మహేంద్రుతో మాట్లాడారా.. లేదా..?
16. శరత్ చంద్రారెడ్డిని ఎన్నిసార్లు కలిశారు..?
17. శరత్ చంద్రాతో తరుచూ మాట్లాడాల్సిన అవసరం ఏంటి..?
18. ఆధారాలు మాయం చేసేందుకు సెల్‌ఫోన్లు ధ్వంసం చేశారా..?
19. సెల్‌ఫోన్లు ఎందుకు ధ్వంసం చేశారు..?
20. గోరంట్ల బుచ్చిబాబుకు మీకున్న సంబంధమేంటి..?
ఈ ప్రశ్నలతో పాటు వీటితో ముడిపడిన పలు అనుబంధ ప్రశ్నలను సంబంధిత వివరాలను కవితను ఈడీ అధికారులు ప్రశ్నించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం..
అయితే ఈ ప్రశ్నలకు తెలియదు, కాదు, అనే సమాధానాలు ఇచ్చినట్లు రాజకీయవర్గాల్లో చర్చజరుగుతోంది. శనివారం విచారణ ముగిసినప్పటికి మళ్లీ 16వ తేదీన కవితను విచారించనున్నారు.