జూన్ 9న చేప ప్రసాదం పంపిణీ

జూన్ 9 న హైదరాబాద్ లో చేప ప్రసాదం పంపిణీ చేయనున్నారు. నాంపల్లి గ్రౌండ్ లో దీని కోసం భారీగా ఏర్పాట్లు చేయనున్నారు. తరతరాలుగా బత్తిన కుటుంబీకులు ఈ చేప ప్రసాదాన్ని ప్రతియేటా క్రమం తప్పకుండా ప్రజలకు ఉచితంగా అందజేస్తున్న సంగతి తెలిసిందే. కరోనా సమయంలో మినహా ఈ పరంపర కొనసాగుతూనే ఉంది.

For More News Click: https://eenadunews.co.in/

ఈ క్రమంలో ఈ ఏడాది కూడా చేప ప్రసాదం పంపిణీ కి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తుంది. బత్తిన కుటుంబంతో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ నేడు సమావేశమయ్యారు. ఈ ఏర్పాట్లపై ఆయనతో విస్తృతంగా చర్చించారు. వచ్చే ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలుగకుండా ప్రభుత్వపరంగా అన్ని ఏర్పాట్లు చేస్తామని ఈసందర్భంగా తలసాని తెలిపారు.

Leave a Reply

%d