ప్రపంచ పర్యావరణ దినోత్సవంత సందర్భంగా డాక్టర్ రెడ్డీస్ ల్యాబోరేటరీస్ లిమిటెడ్ కు ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి ప్రతిష్టాత్మకమైన ఎన్విరాన్ మెంట్ ఎక్సలెన్స్ 2023 అందించింది. విజయవాడలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి ఈ అవార్డ్ రెడ్డీస్ ల్యాబ్ ప్రతినిధులకు అందించారు. శ్రీకాకుళంలోని రెడ్డీస్ ల్యాబోరేటరీస్ వద్ద నియమనింబంధనలకు కట్టుబడి ఎటువంటి కాలుష్యం లేకుండా సంస్థ పని చేయడంతో ఈ అవార్డ్ దక్కినట్టు రెడ్డీస్ ల్యాబ్ ప్రతినిధులు తెలిపారు.