పురుషుడి వెనకభాగం నుండి కడుపులోకి వొడ్కా బాటిల్ పెట్టారు

మందుబాబులు అతి దారుణంగా ప్ర‌వ‌ర్తించారు. మ‌ద్యం సేవించిన త‌ర్వాత తోటి స్నేహితుడి పురీష‌నాళం( Rectum ) ద్వారా క‌డుపు( Stomach )లోకి వొడ్కా బాటిల్‌( Vodka bottle )ను చొప్పించారు. తీవ్ర‌మైన క‌డుపునొప్పితో బాధ‌ప‌డుతూ ఆస్ప‌త్రికి వెళ్ల‌గా, వైద్యులు( Doctors ) స‌ర్జ‌రీ నిర్వ‌హించి, ఆ బాటిల్‌ను తొల‌గించారు. ఈ ఘ‌ట‌న నేపాల్‌( Nepal )లోని రౌత‌హ‌త్ జిల్లాలో వెలుగు చూసింది. వివ‌రాల్లోకి వెళ్తే.. రౌత‌హ‌త్ జిల్లాలోని గుజారా మున్సిపాలిటీకి చెందిన నుర్సాద్ మ‌న్సూరి( Nursad Mansuri )కి ఐదు రోజుల క్రితం తీవ్ర‌మైన క‌డుపు నొప్పి వ‌చ్చింది. దీంతో ఆ నొప్పిని భ‌రించ‌లేక నుర్సాద్ ఆస్ప‌త్రికి వెళ్లాడు. క‌డుపు కూడా వాచిపోవ‌డంతో వైద్యులు స్కానింగ్ చేయ‌గా, క‌డుపులో వొడ్కా బాటిల్ ఉన్న‌ట్లు గుర్తించారు. ఇక అదే రోజు నుర్సాద్‌కు శ‌స్త్ర చికిత్స( Surgery ) నిర్వ‌హించి, వొడ్కా బాటిల్‌ను విజ‌య‌వంతంగా తొల‌గించారు. ఈ స‌ర్జ‌రీకి రెండున్న‌ర గంట‌ల స‌మ‌యం ప‌ట్టిన‌ట్లు డాక్ట‌ర్లు తెలిపారు. బాధిత వ్య‌క్తి ఆరోగ్యంగా ఉన్న‌ట్లు పేర్కొన్నారు.

అయితే ఇటీవ‌లే నుర్సాద్ మ‌న్సూరితో పాటు అత‌ని స్నేహితులంతా క‌లిసి మ‌ద్యం సేవించారు. ఆ స‌మ‌యంలో మ‌ద్యం మ‌త్తులో నుర్సాద్ పురీష‌నాళం ద్వారా క‌డుపులోకి వొడ్కా బాటిల్‌ను చొప్పించి ఉండొచ్చ‌ని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ కేసులో నుర్సాద్ స్నేహితుల‌ను ఇప్ప‌టికే విచారించారు. షేక్ స‌మీమ్ అనే యువ‌కుడిని పోలీసులు అరెస్టు చేసి విచారిస్తున్నారు. ఈ ఘ‌ట‌న‌కు అత‌నే కార‌కుడ‌ని పోలీసులు భావిస్తున్నారు. అయితే క‌డుపులోకి వొడ్కా బాటిల్ ఎలా వ‌చ్చింద‌నే విష‌యం నుర్సాద్‌కు తెలియ‌క‌పోవ‌డం ప‌ట్ల పోలీసులు త‌ల‌లు ప‌ట్టుకుంటున్నారు.

Leave a Reply

%d