ఎంపీపీ భర్తపై వీధికుక్క దాడి

రాష్ట్రంలో వీధి కుక్కల దాడులు రోజు రోజుకు ఎక్కువై పోతున్న సంగతి తెలిసిందే. ప్రతి రోజు పదుల సంఖ్య లో కుక్కల దాడిలో పలువురు గాయపడుతూనే ఉన్నారు. ఈ మధ్యనే హైదరాబాద్ పెద్ద అంబర్ పేట్ లో వీధి కుక్క దాడిలో నాలుగేళ్ల బాలుడు మృతి చెందిన ఘటన రెండు తెలుగు రాష్ట్ర ప్రజలను దిగ్బ్రాంతికి గురి చేసింది. ఈ ఘటన తో ప్రభుత్వం వీధి కుక్కల విషయంలో పలు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇదిలా ఉంటె తాజాగా నిర్మల్ జిల్లాలో బాసర మండలం బిడ్రేల్లీలో వీధి కుక్క దాడిలో బాసర ఎంపీపీ భర్త విశ్వనాథ్ పటేల్‌కు తీవ్ర గాయాలయ్యాయి. రోడ్డుపై నడుచుకుంటూ వెళుతుండగా.. వెనుక నుంచి వీధి కుక్క వచ్చి దాడి చేసింది. ఈ దాడిలో విశ్వనాథ్ పటేల్‌కు తీవ్రగాయాలయ్యాయి. కుక్క రావడాన్ని విశ్వనాథ్ గమనించలేదు. వెనుక నుంచి వచ్చిన కుక్క విశ్వనాథ్ కాళ్లను పట్టుకుంది. ఈ దాడితో విశ్వనాథ్ కుప్పకూలిపోయాడు. అక్కడే ఉన్న మరొక వ్యక్తి తరమడంతో అక్కడ నుంచి కుక్క పారిపోయింది. స్థానికులు వెంటనే ఆయనను ఆస్పత్రికి తరలించారు. ‌అయితే కుక్క దాడి చేసిన సీసీ టీవీ విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

Leave a Reply

%d