ఒకే వ్యక్తికి కొన్ని గంటల వ్యవధిలో రెండుసార్లు అవయవ మార్పిడి చేయడం వైద్య చరిత్రలో వైద్యులకు అరుదైన ఘటన. దానికి తోడు రెండూ విజయవంతంగా చేయడం మరింత అరుదు. విశాఖపట్నానికి చెందిన కిమ్స్ ఐకాన్ ఆస్పత్రి ఈ సంవత్సరం మరోసారి ఇలాంటి విజయాన్ని తన సొంతం చేసుకుంది. ఒకేరోజు మూత్రపిండాలు, కాలేయ మార్పిడి చేసి, రోగికి ఈ ఆస్పత్రి వైద్యులు ఊరట కల్పించారు. తద్వారా అమలాపురానికి చెందిన 50 ఏళ్ల వ్యాపారికి సరికొత్త జీవితాన్ని ప్రసాదించారు. హెపటైటిస్ సి కారణంగా కాలేయ క్యాన్సర్, లివర్ సిరోసిస్ రెండూ వచ్చి బాధపడుతూ, అదే సమయంలో దీర్ఘకాల మూత్రపిండ వ్యాధి (సీకేడీ) కూడా ఉండి.. దాదాపు మృత్యువు ముంగిట ఉన్న ఆయనకు ఈ శస్త్రచికిత్సలతో జీవితం మళ్లీ కొత్త మలుపు తీసుకుంది. శస్త్రచికిత్సలు జరిగిన 15 రోజుల పాటు రోగిని పూర్తిస్థాయిలో పరీక్షించి.. ఇప్పుడు అన్నీ సాధారణంగా ఉండటంతో డిశ్చార్జి చేశారు.
For More News Click: https://eenadunews.co.in/
ఇందుకు సంబంధించిన వివరాలను కిమ్స్ ఐకాన్ ఆస్పత్రికి చెందిన మెడికల్ గ్యాస్ట్రో ఎంటరాలజిస్టు డాక్టర్ చలపతిరావు ఆచంట, నెఫ్రాలజిస్టు డాక్టర్ ఆర్‌కె.మహేష్ తెలిపారు. “లివర్ కేన్సర్, లివర్ సిరోసిస్ కారణంగా రోగి కాలేయం బాగా పాడైపోయింది. దానికితోడు అతడి మూత్రపిండాలు కూడా పాడవ్వడంతో సాధారణ చికిత్సలు చేసినా ఏమాత్రం బాగుపడలేదు. దీంతో అతడికి రెండు అవయవాలూ మార్చాల్సిందేనని ఆస్పత్రి వైద్య కమిటీ భావించింది. అయితే ఇలా ఒకే వ్యక్తి కోసం రెండు అవయవాలు సేకరించడం అతి పెద్ద సమస్య. , అతని ప్రాణాలు ప్రమాదంలో ఉండటంతో అత్యవసరంగా దాతల కోసం చూడాల్సి వచ్చింది. ఇటీవల శ్రీకాకుళంలో బ్రెయిన్ డెడ్ అయిన ఒక వ్యక్తి నుంచి ఒక మూత్రపిండం, కాలేయం జీవన్‌దాన్”ద్వారా పొందగలిగాము. సరైన సమయంలో ఈ రెండు అవయవాలు దొరకడం, అతి తక్కువ సమయంలోనే ఆ రెండింటినీ మార్చడంతో అతడి ప్రాణాలు కాపాడగలిగాం”అని తెలిపారు.
For More News Click: https://eenadunews.co.in/
ఏప్రిల్ 22న విశాఖపట్నంలోని కిమ్స్ ఐకాన్ ఆస్పత్రిలో ఈ అరుదైన శస్త్రచికిత్సలు చేశారు. కాలేయ మార్పిడి చేసిన వైద్య నిపుణుల్లో కాలేయమార్పిడి బృందంలో డాక్టర్ రవిచంద్ సిద్దాచారి, డాక్టర్ సచిన్ డాగా, డాక్టర్ మురళీధర్ నంబాడ, డాక్టర్ రవిచంద్రారెడ్డి ఉన్నారు. అలాగే మూత్రపిండాల మార్పిడి చేసిన బృందంలో డాక్టర్ ఉమామహేశ్వరరావు, డాక్టర్ మురళీకృష్ణ పద్యాల, గ్యాస్ట్రో ఎంటరాలజిస్టు డాక్టర్ ఆచంట చలపతిరావు, నెఫ్రాలజిస్టు డాక్టర్ ఆర్.కె.మహేష్, ఇంకా ఎనస్థీషియా, క్రిటికల్ కేర్ విభాగాలకు చెందిన వైద్యనిపుణులు పాల్గొన్నారు. ఈ రెండు శస్త్రచికిత్సలూ విజయవంతం కావడంతో రోగి వేగంగా కోలుకున్నారని, పది రోజుల తర్వాత ఆయనను డిశ్చార్జి చేశామని వైద్యులు తెలిపారు. ఇప్పుడు ఆయన కాలేయం, మూత్రపిండాలు రెండూ సాధారణ స్థాయిలో పనిచేస్తున్నాయన్నారు.