“ఫ్లైట్‌లలో ప్రయాణం చేసే వాళ్లకు ఓ డిగ్నిటీ ఉంటుంది. చాలా డీసెంట్‌గా బిహేవ్ చేస్తారు” ఇందతా పాత ముచ్చట. ఇప్పుడు విమానాల్లోనే వింత ఘటనలు జరుగుతున్నాయి. ప్యాసింజర్స్ సీట్‌ల కోసం కొట్టుకుంటున్నారు. సిబ్బందితో గొడవ పడుతున్నారు. నోటికొచ్చినట్టు తిడుతున్నారు. ఒక్కరిద్దరి కారణంగా ప్రయాణికులందరూ ఇబ్బంది పడాల్సి వస్తోంది. ఇప్పుడు ఇలాంటి ఘటనే మరోటి వెలుగులోకి వచ్చింది. డెల్టా ఎయిర్‌లైన్స్‌కి (Delta Airlines) చెందిన ఫ్లైట్‌లో ఓ ప్యాసింజర్ పీకలదాకా తాగాడు. సైలెంట్‌గా పడుకోకుండా పక్క వాళ్లను ఇబ్బంది పెట్టాడు. అలాస్కాకు వెళ్తున్న ఫ్లైట్ ఎక్కిన 61 ఏళ్ల ప్రయాణికుడు ఫుల్‌గా తాగి సిబ్బందితో అసభ్యంగా ప్రవర్తించాడు. ఇక్కడ మరీ షాకింగ్ విషయం ఏంటంటే…ఓ మేల్ అటెండెంట్‌ని గట్టిగా పట్టుకుని ముద్దు పెట్టుకున్నాడు. అక్కడితో ఆగకుండా “నువ్వు చాలా అందంగా ఉన్నావ్” అంటూ కాంప్లిమెంట్ కూడా ఇచ్చాడు. The New York Post న్యూస్‌పేపర్ వెల్లడించిన వివరాల ప్రకారం…ఆ ప్యాసింజర్ పేరు డేవిడ్ అలన్ బ్రూక్. మిన్నెసొట నుంచి అలాస్కా వెళ్లేందుకు ఏప్రిల్ 10వ తేదీన ఫ్లైట్ ఎక్కాడు. బిజినెస్ ఫస్ట్ క్లాస్‌లో టికెట్ బుక్ చేసుకున్నాడు. ఫస్ట్ క్లాస్‌లో ట్రావెల్ చేసే వాళ్లకు ఆల్కహాల్ సర్వ్ చేస్తారు. కానీ దానికంటూ ఓ లిమిట్ ఉంటుంది. డేవిడ్ మాత్రం అవేమీ పట్టించుకోకుండా ఫుల్‌గా తాగాడు. ఆ తరవాత ఫ్లైట్ క్రూకి చుక్కలు చూపించాడు.
ఫుల్ గా తాగి విమానంలో బలవంతంగా ముద్దు
