యువకుడి ఆవయవదానం

తాను మరణిస్తూ ఐదుగురి జీవితాల్లో వెలుగులు నింపాడు ఓ యువకుడు. విద్యాదికుడై సమాజసేవ కోసం బ్రతికినన్ని రోజులు ప్రజా సేవలో ఉండి… చనిపోయిన తరువాత కూడా ఇతరులకు సాయం చేసి చనిపోయినందుకు గర్వంగా ఉందని మృతుని కుటుంబ సభ్యులు తెలిపారు. వివరాల్లోకి వెళ్తే.. నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం దుబ్బతాండ గ్రామ సర్పంచ్ మాలోతు అంజమ్మ కుమారడు మాలోతు హరిబాబు (36) వృత్తిరీత్యా సమాజసేవకుడు. ఇటీవల ఖమ్మం జిల్లాకు ప్రయాణిస్తున్న తరుణంలో హైబిపి రావడంతో కుప్పకూలిపోయాడు. దీంతో మార్గమద్యంలో స్థానిక ఆస్పత్రికి తీసుకవెళ్లి వైద్యం చేయించారు. మెరుగైన వైద్యం కోసం సికింద్రాబాద్ లోని కిమ్స్ ఆస్పత్రికి తరలించారు. అతన్ని రక్షించడానికి రెండు రోజుల పాటు వైద్యులు ఎంతో శ్ర‌మించారు. కానీ దురుదృష్ట‌వశాస్తూ శుక్రవారం ఉదయం రోజున బ్రెయిన్ డెడ్ అయ్యారు.
ఆ త‌ర్వాత అవ‌య‌వ‌దానంపై కిమ్స్ ఆస్పత్రిలోని అవయవదాన సమన్వయ కర్తలు, మృతుని కుటుంబ సభ్యులకు, బంధువుల‌కు, గ్రామస్థులకు అవ‌గాహ‌న‌ క‌ల్పించారు. అనంతరం వారి అంగీకారంతో కిడ్నీలు, లివర్, ఊపిరితిత్తులు దానం చేశారు. చ‌నిపోతూ మ‌రో ఐదుగురి జీవితాల్లో వెలుగులు నింపింనందుకు గ‌ర్వంగా ఉంద‌ని కుటుంబ స‌భ్యులు తెలిపారు. మృతునికి భార్య మంగ, ఇద్దరు కుమారులు శన్ముఖుసాయి (7), వేదిత్ (5) ఉన్నారు. కిమ్స్ ఆస్పత్రికి స్థానిక ఎమ్మెల్యే భాస్కర్ రావు వచ్చి నివాళ్లు అర్పించారు. జీవ‌న్‌ధాన్ ఆధ్వ‌ర్యంలో ఏర్పాటు చేసిన గ్రీన్ ఛానెల్ ద్వారా అవ‌స‌రం ఉన్న‌చోటికి అవయవాలను తరలించామని జీవన్ దాన్ కమిటీ సభ్యులు తెలిపారు.

Leave a Reply

%d