సెల్ ఫోన్ ఆర్డర్ చేస్తే… సబ్బు వచ్చింది

టైమ్ బ్యాడ్ అయితే తాడే పామై కరిచిందని..! ఆఫర్లకు ఆశపడి ఆన్ లైన్ షాపింగ్ చేసిన ఓ వ్యక్తికి దిమ్మతిరిగి మైండ్ బ్లాక్ అయ్యింది. సెల్ ఫోన్ ఆర్డర్ చేస్తే సబ్బుబిళ్లవచ్చి షాకిచ్చింది.దీంతో అవాక్కవడం అతని వంతైంది. ఈ ఘటన ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం పేరుపల్లిలో వెలుగు చూసింది. గ్రామానికి చెందిన కడిమి జగన్‌‌ ‘మీషో’ యాప్‌‌లో నోకియా 2660 మోడల్‌‌ ఫోన్‌‌ను ఆర్డర్ చేశాడు. 1,066 చెల్లించి పార్సిల్‌‌ తీసుకున్నాడు. పార్శిల్‌ ఓపెన్‌ చేసి చూసి ఒక్కసారిగా విస్తూ పోయాడు.ఎందుకంటే, వచ్చిన పార్శిల్‌ విప్పి చూడగా అందులో సబ్బు కనిపించింది. దీంతో డెలివరీ బాయ్‌‌ని నిలదీయడంతో డబ్బు తిరిగి ఇచ్చేశాడు. తీసుకున్న ఆ సంస్థ పంపించిన పార్సిల్ ను తెరిచిన అతనికి 10 రూపాయల బట్టల సబ్బు దర్శనమివ్వడంతో నిర్ఘాంతపోయాడు. ఈ ఘటన సింగరేణి మండలం పేరేపల్లి లో వెలుగు చూసింది.

Leave a Reply

%d