ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో వైఎస్‌ఆర్‌సిపి ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డికి ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 18న తమ ముందు వ్యక్తిగతంగా హాజరుకావాలని ఆదేశించింది. ఇదే కేసులో ఇప్పటికే మాగుంట శ్రీనివాసులు రెడ్డి కొడుకు రాఘవరెడ్డి అరెస్టయ్యారు. ఫిబ్రవరి 10న రాఘవరెడ్డిని ఈడీ అరెస్ట్ చేసింది. ప్రస్తుతం ఆయన తీహార్ జైలులో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ‘సౌత్ గ్రూప్’లో కీలకంగా వ్యవహరించారని ఆరోపణలు ఎదుర్కొంటున్న శ్రీనివాసులు రెడ్డికి కూడా ఈడీ నోటీసులు జారీ చేయడం సంచలనం రేపుతోంది.
లిక్కర్ స్కాంలో మరో ఎంపీకి ఈడీ నోటీసులు
