సిసోడియా కస్టడి పొడిగింపు, కవితకు టెన్షన్

ఆప్‌ నేత, మాజీ ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్‌ సిసోడియా ఈడీ మనీలాండరింగ్‌ కేసులో జ్యుడీషియల్‌ కస్టడీని రౌస్‌ అవెన్యూ కోర్టు ఈ నెల 17 వరకు పొడిగించింది. దర్యాప్తు కీలక దశలో ఉందని, జ్యుడీషియల్‌ కస్టడీని పొడిగించాలని కోరుతూ ఈడీ కోర్టును ఆశ్రయించింది. ఈ క్రమంలో కోర్టు కస్టడీని పొడిగించింది. మరో వైపు సీబీఐ విచారిస్తున్న ఢిల్లీ మద్యం పాలసీ కేసులో మనీష్ సిసోడియా బెయిల్ పిటిషన్‌పై ఈ నెల 12న విచారణ జరుగనున్నది. మద్యం పాలసీ కేసులో ఫిబ్రవరి 26న మనీష్‌ సిసోడియాను సీబీఐ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. దాదాపు ఎనిమిది గంటలకుపైగా విచారించిన ఆయనను అరెస్టు చేసినట్లు సీబీఐ ప్రకటించింది. ఆ తర్వాత ఢిల్లీలోని రౌస్‌ అవెన్యూ కోర్టులో హాజరుపరిచింది. ఆ తర్వాత సీబీఐ కస్టడీకి ఇచ్చింది. విచారణ అనంతరం ఆయనను జ్యుడీషియల్‌ కస్టడీపై జైలుకు పంపింది. ఈడీ, సీబీఐ కేసుల్లో ఆయన జ్యుడీషియల్‌ కస్టడీలో ఉంటూ వస్తున్నారు.

అలాగే మరోవైపు సౌత్ గ్రూప్ నుండి భారస ఎమ్మెల్సీని మరోమారు విచారణకు పిలిచి అరెస్ట్ చేస్తారనే  అంశం కూడా రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అయితే ఇది ఎంత వరకు నిజమనేది తేలాలంటే వేచి చూడాలి మరి.

Leave a Reply

%d bloggers like this: