నానాటికి ప్రపంచ వ్యాప్తంగా ఆర్ధిక సంక్షోభం వెంటాడుతోంది. చాలా పెద్ద పెద్ద కంపెనీలు ఐటీ ఉద్యోగులను తొలగించి విషయం తెలిసిందే. ఈ ఉద్యోగాల కోత ఐటీతో పాటు హార్డ్ వేర్ మీద కూడా పడుతోంది.
కోవిడ్-19 వైరస్ వల్ల ప్రపంచంలోని అన్ని దేశాల్లో ఆర్ధిక పరిస్థితి దిగజారిపోయింది. దీంతో ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితుల్లో ఉద్యోగులు ఆరోగ్య భధ్రత కోసం ఇంటి నుండి పని చేయాలని సూచించాయి. దీంతో పాటు పాఠశాలలు కూడా ఆన్ లైన్ తరగతులు ప్రారంభించడంతో డెస్క్ టాప్ లు, ల్యాప్ టాప్ లు , ట్యాబ్ లు, స్మార్ట్ ఫోన్లకు చాలా గీరాఖీ పెరింగింది. డెస్క్ టాప్ ల తయారీ సంస్థ భారీగా ఉద్యోగులకు చేర్చుకొని అధికంగా తయారీని పెంచింది. కాగా ఇప్పుడు పరిస్థితులు తలకిందులు కావడంతో తలపట్టుకుంటుంది. కరోనా తగ్గుముకం పట్టడంతో ఆయా కంపెనీలు తిరిగి కార్యాలయాలకు రావాలని సూచించడంతో డెల్ కంపెనీకి చాలా పెద్ద ఎదురుదెబ్బ తగిలిందనే చెప్పుకోవాలి. ఆ కంపెనీ నుండి దాదాపు 6650 మందికి ఉద్వాసన పలికేందుకు సిద్దమైంది. వాస్తవానికి ఉద్యోగల తొలగింపు ఐటీ విభాగంలో ఉందనకున్నారు కానీ డెల్ లాంటి వాటి మీద పడడంతో కొత్త చిక్కులు ఎదురవుతున్నాయంటున్నారు ఆర్థిక విశ్లేషకులు.