ఈటల హత్యకు కౌశిక్ రెడ్డి కుట్ర

బిజెపి ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ను చంపేందుకు కుట్ర జరుగుతోందని ఆయన భార్య జమున ఆరోపించారు. జమున మాట్లాడుతూ.. ‘‘రూ.20 కోట్లు ఇచ్చి ఈటలను చంపిస్తానని కౌశిక్‌ రెడ్డి అన్నట్లు తెలిసింది. ఈటలను చంపేస్తామంటే భయపడేది లేదు. కౌశిక్‌ రెడ్డి మాటల వెనక కెసిఆర్‌ ఉన్నారు. ఇలాంటి సీఎం తెలంగాణ ప్రజలకు అవసరమా? రూ.20 కోట్లు కాదు.. ఓటుతో ప్రజలు కెసిఆర్‌కు బుద్ధి చెప్తారు. శాడిస్టులను పక్కన పెట్టుకొని కెసిఆర్‌ పాలన చేస్తున్నారు. కెసిఆర్‌‌.. కౌశిక్‌ రెడ్డిని హుజూరాబాద్‌ ప్రజలపైకి ఉసిగొల్పారు. ఆయన హుజూరాబాద్‌లో అరాచకాలు సృష్టిస్తున్నారు’’ అని జమున ఆరోపించారు.

Leave a Reply

%d