హైదరాబాద్ లో ఈడీ ఆఫీస్ విస్తరణ అందుకేనా ?

దర్యాప్తు సంస్థల విషయంలో బీఆర్ఎస్, బీజేపీ మధ్య యుద్ధం కొనసాగుతోంది. అయినా, ఐటీ, ఈడీ, సీబీఐ దూకుడుగానే ముందుకు వెళ్తున్నాయి. ముఖ్యంగా బీఆర్ఎస్ నేతలు, వారితో సత్సంబంధాలు కొనసాగిస్తున్న వారిని టార్గెట్ చేస్తున్నాయి. అయితే.. ఐటీ, సీబీఐ కన్నా.. ఈడీ తీసుకునే చర్యలే అధిక ప్రభావాన్ని చూపిస్తాయి. దీంతో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ .. ఫుల్ ఫోర్స్ తో ఏదో ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. బషీర్ బాగ్ లోని ఆఫీస్ ను ఈడీ విస్తరించింది. బీఆర్ఎస్ లక్ష్యంగానే అధిక సంఖ్యలో సిబ్బందిని నగరానికి తీసుకొచ్చినట్లు సమాచారం. ఇప్పటిదాకా ఆయకార్ భవన్ లో మూడో అంతస్తులోనే ఈడీ ఉందేది. ఇప్పుడు ఆఫీస్ ను 4, 2 అంతస్తులకు విస్తరించారని తెలుస్తోంది. ప్రత్యేక నిఘా పెట్టి వరుస దాడులకు ఈడీ సిద్ధమౌతున్నట్లుగా విశ్వసనీయ వర్గాల నుంచి అందుతున్న సమాచారం. కేసీఆర్ పై గురి పెట్టే లక్ష్యంతో బీఆర్ఎస్ తో సంబంధాలు కొనసాగిస్తున్న వారిపై ఈడీ ఇప్పటికే ఫోకస్ పెట్టినట్లుగా తెలుస్తోంది.

Leave a Reply

%d