ఫేస్ బుక్ పై కేసు వేసి.. రూ.41 లక్షలు గెలుచుకున్నాడు

ఓ వ్యక్తి ఫేస్ బుక్ అకౌంట్ ను మెటా సంస్థ ఎలాంటి వివరణ ఫేస్ బుక్ లాక్ చేసింది. దీంతో ఆ వ్యక్తి కోర్టులో దావా వేసి ఏకంగా రూ.41 లక్షలు గెలుచుకున్నాడు. అసలేం జరిగిందంటే?

ఈ రోజుల్లో చదువుకున్న చాలామంది ఉదయం నిద్రలేచినప్పటి నుంచి రాత్రి నిద్రపోయేంత వరకూ ఎక్కువ సమయం సోషల్ మీడియాలోనే కాలక్షేపం చేస్తూ ఉంటారు. మరీ ముఖ్యంగా ఫేస్ బుక్ లో ఎక్కువ సమయం గడుపుతూ సమస్యలపై పోస్ట్ చేస్తూ సమాచారాన్ని తెలుసుకుంటుంటారు. కాగా, సమకాలీన రాజకీయ వ్యవహారాలు, సమాజంలోని నెలకొన్న పరిస్థితుల పట్ల ప్రతీ ఒక్క అంశంపై ఫేస్ బుక్ లో పోస్ట్ చేస్తూ ఉంటారు. ఇక జార్జియాకు చెందిన క్రాఫ్టోన్ అనే వ్యక్తి కూడా అందరిలాగే ఫేస్ బుక్ ను ఎక్కువగా యూజ్ చేసేవాడు. ఇతడు వ్యక్తి వృత్తిరిత్యా లాయర్ కావడం విశేషం.

దీంతో సమాజంలో పరిస్థితులు, అనేక సమస్యల పట్ల తరుచు ఫేస్ బుక్ లో పోస్ట్ చేస్తూ ప్రశ్నిస్తూ ఉండేవాడు. అయితే, ఇటీవల అతడు ఓ పొలిటికల్ అంశంపై ఫేస్ బుక్ లో పోస్ట్ చేశాడు. ఈ కారణంతోనే ఫేస్ బుక్ అతడికి వార్నింగ్ కూడా ఇచ్చింది. అయినా అతడు స్పందించలేదని తెలుస్తుంది. కట్ చేస్తే.. కొన్ని రోజుల తర్వాత ఫేస్ బుక్ ఎలాంటి వివరణ లేకుండాక్రాఫోర్ట్ అకౌంట్ ను లాక్ చేసింది. ఏం జరిగిందని అతడు తెలుసుకునే ప్రయత్నం చాలా సార్లు చేశాడు. కానీ, ఫేస్ బుక్ టీం స్పందించలేదు. ఇక చేసేదేం లేక క్రాఫ్టోన్ న్యాయపోరాటానికి దిగుతూ ఇటీవల ఫేస్ బుక్ మెటా సంస్థపై పై కోర్టులో దావా వేశాడు.

దీనిపై స్పందించిన న్యాయస్థానం ఎలాంటి వివరణ ఇవ్వకుండా నా అకౌంట్ ను ఫేస్ బుక్ లాక్ చేసిందని ఆరోపించాడు. ఇక దీనిపై న్యాయస్థానం సైతం స్పందించి విచారణ చేపట్టింది. ఈ క్రమంలోనే ఫేస్ బుక్ లీగల్ టీం స్పందించింది. విచారించిన న్యాయస్థానం.. ఎలాంటి వివరణ ఇవ్వకుండా క్రాఫ్టోన్ ఫేస్ బుక్ అకౌంట్ ను లాక్ చేయడం కరెక్ట్ కాదని, నష్టపరిహారం కింద అతనికి 50 డాలర్లు, అంటే ఇండియా కరెన్సీతో పోలిస్తే రూ.41 లక్షలు ఇవ్వాలని సూచించింది. ఇక మెటా సంస్థ వెంటనే స్పందించి క్రాఫ్టోన్ ఫేస్ బుక్ అకౌంట్ ను పునరుద్దరించింది. ఇక ఇదే అంశం ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది.

 

 

 

Leave a Reply

%d bloggers like this: