సిద్దిపేటలో సముద్రం లేదని, శిల్పారామంలో ఆర్టిఫిషియల్ బీచ్ ఏర్పాటు చేసి సముద్రం లేని లోటు తీరుస్తామని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు చెప్పారు. శనివారం రాత్రి సిద్దిపేట కోమటి చెరువద్ద శిల్పారామం నిర్మాణ పనులను సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిద్దిపేట పట్టణ అభివృద్ధిలో ప్రజల పాత్రే ఎక్కువుందని, చేసిన ప్రతి పనిని నిలబెట్టి ఈ ప్రాంత గౌరవాన్ని నిలబెట్టారన్నారు. నాలుగు నెలల్లో శిల్పారామాన్ని పూర్తి చేస్తామని, కోమటి చెరువు వద్ద డైనోసర్ పార్క్ త్వరలో అందుబాటులోకి రానున్నదని చెప్పారు. రంగనాయక సాగర్‌ను టూరిస్ట్ డెస్టినేషన్ సెంటర్‌గా తీర్చిదిద్దే పనులు వేగంగా జరుగుతున్నాయన్నారు.
సిద్దిపేటలో ఆర్టిఫిషియల్ బీచ్ ఏర్పాటు చేస్తం – హరీశ్‌రావు
