సీబీఐ మాజీ డైరెక్టర్, మాజీ మంత్రి కన్నుమూత

మాజీమంత్రి, మాజీ సీబిఐ CBI డైరెక్టర్ విజయ రామారావు మృతి చెందారు. ఈ మేరకు తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అపోలో ఆస్పత్రికి చేరుకొని సంతాపం తెలియజేశారు. మంత్రిగా, అధికారిగా విజయ రామారావు అందించిన సేవలను స్మరించుకున్నారు. విజయ రామారావు కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. 1959 ఐపీఎస్ బ్యాచ్ కు చెందిన ఆయన.. వివిధ హోదాల్లో పనిచేశారు. 1984 సంక్షోభం నాటికి హైదరాబాద్ కమిషనర్ గా ఉన్నారు. అనంతరం సీబీఐ డైరెక్టర్ గా విధులు నిర్వర్తించి ఎన్నో కేసులపై దర్యాప్తు చేపట్టారు. 1999 అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం తరపున ఖైరతాబాద్ నియోజకవర్గం నుంచి పోటీచేసి విజయం సాధించారు. 2004, 2009 ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. తెలుగుదేశం పార్టీలో పని చేసిన ఆయన కొన్నాళ్ల తరువాత పార్టీకి రాజీనామాా చేశారు.

Leave a Reply

%d bloggers like this: