నగరంలోని ప్రధాన ఆస్పత్రులలో ఒకటైన సెంచురీ ఆస్పత్రి ఆధ్వర్యంలో శుక్రవారం ఉచిత వైద్యశిబిరం నిర్వహించారు. సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఉచితంగా ఇఎన్ టీ వైద్య శిబిరం నిర్వహించారు. ఆస్పత్రికి చెందిన కన్సల్టెంట్ ఇఎన్ టీ డాక్టర్ చైతన్య నర్సింగ్ సిబ్బంది తదితరులు పాల్గొని, శిబిరానికి వచ్చిన ప్రజలకు వివిధ వైద్యపరీక్షలు చేశారు. ముఖ్యంగా వినికిడి సమస్యలు, గొంతు, మెడ సమస్యలతో పాటు ఎత్తు బరువు నిష్పత్తిని తెలియజేసి, పలు జాగ్రత్తలు సూచించారు. సుమారు 260 మంది వరకు పరిసర ప్రాంతాలకు చెందిన ప్రజలు ఈ శిబిరానికి వచ్చి, పరీక్షలు చేయించుకున్నారు.
జీవనశైలి మార్పులే ప్రధానం
శిబిరానికి వచ్చినవారిలో పలువురికి వినికిడి సమస్యలు ఉన్నట్లు గమనించడంతో వారికి డాక్టర్ చైతన్య పలు సూచనలు చేశారు ఇఎన్ టీ సమస్యలు ఉన్నవారు వైద్యుల సలహాల మేరకు తగిన మందులు వాడటంతో పాటు.. ఆహారం నియమాలను ఎలా తీసుకోవాలో తెలిపారు.