కుక్కల మేయర్.. సొంత వాయిస్తో ఆర్జీవీ పాట

కుక్కల మేయర్..అడుక్కున్న పన్నులు అన్నీ మింగిన మీరు.. మొరిగించి.. కరిపించి.. చంపించారు.. మీ ఇంటిలోకి వందల కుక్కలు వదిలితే మీ పరిస్థితి.. అప్పుడు కానీ నొప్పి తెలియదు మీ కుక్క బ్రెయిన్ కు.. పాపం ఎవరిది మేయర్.. ప్రాణం ఎవదిరి మేయర్.. పాపం ఎవరిది మేయర్.. ప్రాణం ఎవరిది మేయర్.. ఆ తల్లిదండ్రుల గుండెలు వెక్కి వెక్కి ఏడుస్తుంటే కొద్దిగా అయిన బాధ ఉందా మీకు..పాట రూపంలో హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మిపై విచుకుపడ్డారు రాంగోపాల్ వర్మ. మార్చి 11వ తేదీ కుక్కల మేయర్ అంటూ.. తానే స్వయంగా పాట రాసి.. పాడి.. దాన్ని సోషల్ మీడియా ద్వారా రిలీజ్ చేశారు.

హైదరాబాద్ లో వీధి కుక్కల దాడిలో నాలుగేళ్ల చిన్నారి చనిపోయిన విషయం తెలిసిందే.  కుక్కల దాడిపై మేయర్ గద్వాల్ విజయలక్ష్మీ చేసిన వ్యాఖ్యలపై దర్శకుడు వర్మ తనదైన శైలిలో కొన్ని రోజులుగా స్పందిస్తూ వస్తున్నారు. ఆమె తన కుక్కకు కుడి చేత్తో చపాతీలు తినిపిస్తూ..ఎడమ చేత్తో తాను తింటున్న వీడియోను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు సైతం హాట్‌ టాపిక్‌ అయ్యాయి. కుక్కలపై మేయర్ గారి ప్రేమ చాలా ఉన్నతంగా ఉంది.. కుక్కలన్నింటినీ ఆమె ఇంటికి తీసుకెళ్లి తినిపిస్తే.. అవి మా పిల్లల్ని తినవు కదా అంటూ ట్వీట్‌ చేశారు. వీధి  కుక్కలపై  ప్రేమ చూపిస్తున్న మేయర్‌ . హైదరాబాద్ సిటీలోని ఐదు లక్షల కుక్కలను ఇంటికి తీసుకెళ్లి మధ్య  కూర్చుంటే బాగుంటుందంటూ కామెంట్ చేశారు వర్మ.  కొన్ని రోజులుగా నడుస్తున్న ట్విట్టర్ వార్ ఆర్జీవీ పాటతో పీక్ స్టేజ్ కు వెళ్లింది.. ఇంతకీ కుక్కల మేయర్ అంటూ ఆర్జీవీ పాడిన పాట ఎలా ఉందో మీరూ వినండీ.

Leave a Reply

%d bloggers like this: