హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై అబ్దుల్లాపూర్‌మెట్ కూడలి వద్ద గ్యాస్ ట్యాంకర్ లారీ అదుపు బోల్తా పడింది. దీంతో భారీగా ట్రాఫిక్ స్తంభించింది. నిత్యం వాహనాలతో రద్దీగా ఉండే హైదరాబాద్-విజయవాడ రహదారిపై గ్యాస్ ట్యాంకర్ డివైడర్ని ఢీకొని బోల్తా పడింది. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ మండలంలో చౌరస్తా దగ్గర ట్యాంకర్ అడ్డంగా పడిపోయింది. దీంతో రహదారికి ఇరువైపుల వాహనాలు నిలిచిపోయాయి. ఈ గ్యాస్ ట్యాంకర్ గుజరాత్ నుంచి హైదరాబాద్ మీదుగా చెన్నై వెళ్తోంది. వాహనాలు ఆగిపోవడం వలన ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పోలీసులు వెంటనే స్పందించి సహాయక చర్యలు చేపడుతున్నారు.
అబ్దుల్లాపూర్‌మెట్ కూడలి వద్ద గ్యాస్ ట్యాంకర్ లారీబోల్తా
