ఇక ఎన్నికలలో పోటీ చేస్తానో లేదో… అన్నా రాంబాబు

రెండు నెలల క్రితం ప్రకాశం జిల్లాలో బాలినేని శ్రీనివాస్ రెడ్డి హడావుడి చేసిన సంగతి తెలిసిందే. జగన్‌ ఆయనను బుజ్జగించడంతో చల్లబడ్డారు. కానీ ఇప్పుడు జిల్లాలోని గిద్దలూరు వైసీపీ ఎంపీ అన్నా రాంబాబు అసంతృప్తి స్వరం వినిపిస్తున్నారు. “గత ఎన్నికలలో తాను 80 వేల భారీ మెజార్టీతో గెలిచానని, అప్పటి నుంచే తన సీటుపై పార్టీలో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన కొందరు నేతల కన్ను పడిందన్నారు. ఈసారి వారు పోటీ చేయాలనుకొంటున్నారని అన్నారు. వారు అలా కోరుకోవడంలో తప్పు లేదు కానీ తన గురించి, తన కులం గురించి దుష్ప్రచారం చేస్తుండటం, జగన్‌కు పిర్యాదులు చేస్తుండటం చాలా బాధాకలిగిస్తోందని అన్నారు. ఒకవేళ జగన్‌ మళ్ళీ తనకే టికెట్‌ ఇస్తే ఎన్నికలలో పోటీ చేసినా పార్టీలోవారే తనను ఓడించేందుకు ప్రయత్నిస్తారేమో అని అన్నా రాంబాబు అనుమానం వ్యక్తం చేశారు. రాజకీయాలలో వచ్చిన చాలామంది భారీగా సంపాదించుకొని ఆస్తులు పోగేసుకొన్నారని, కానీ తాను మాత్రం చాలా నష్టపోయానని అన్నారు. ఇటువంటి పరిస్థితులలో మళ్ళీ పోటీ చేయడం… చేసి ఇంకా నష్టపోవడం అవసరమా?అని ఆలోచిస్తున్నానని,” అన్నా రాంబాబు అన్నారు. ఇక ప్రకాశం జిల్లాలోనే పర్చూరు వైసీపీ నియోజకవర్గం వైసీపీ ఇన్‌ఛార్జ్‌ ఆమంచి కృష్ణమోహన్ సోదరుడు (అన్న) ఆమంచి స్వామి త్వరలో జనసేన పార్టీలో చేరబోతున్నారు. వచ్చే ఎన్నికలలో తాను జనసేన పార్టీ తరపున గిద్దలూరు నుంచి పోటీ చేయబోతున్నట్లు కూడా ఆయనే ప్రకటించేశారు. అంటే ప్రకాశం జిల్లా వైసీపీలో ఇంకా నిప్పు రాజుకొంటూనే ఉందని అర్దమవుతోంది.

Leave a Reply

%d