బంగారం, వెండి ధరలు ప్రతిరోజూ మార్పులు చేర్పులకు లోనవుతుందన్న విషయం తెలిసిందే. అయితే గత కొద్ది రోజులుగా బంగారం ధర తగ్గడమే కానీ పెరగడం అయితే లేదు. దాదాపు పది రోజులుగా ఇదే జరుగుతోంది. మధ్యలో ఒకటి, రెండు రోజులు పెరిగినా కూడా అది పరిగణలోకి తీసుకోవాల్సినంత అయితే కాదు. ఇక నేడు కూడా బంగారం ధర పెరిగింది.
బంగారం, వెండి ధరలు ప్రతిరోజూ మార్పులు చేర్పులకు లోనవుతుందన్న విషయం తెలిసిందే. అయితే గత కొద్ది రోజులుగా బంగారం ధర తగ్గడమే కానీ పెరగడం అయితే లేదు. దాదాపు పది రోజులుగా ఇదే జరుగుతోంది. మధ్యలో ఒకటి, రెండు రోజులు పెరిగినా కూడా అది పరిగణలోకి తీసుకోవాల్సినంత అయితే కాదు. ఇక నేడు కూడా బంగారం ధర పెరిగింది. ఈరోజు కూడా పెరుగుదలను పరిగణలోకి తీసుకోవల్సిన అవసరమైతే లేదు కానీ ఇన్ని రోజుల తర్వాత పెరిగిందంటే.. ఇక బంగారానికి పట్టాపగ్గాలు ఉంటాయో లేదో చెప్పలేం. ఒకసారి పెరిగిందంటే.. అదేదో ఆనవాయితీ మాదిరిగా పెరుగుతూనే ఉంటుంది. ఎప్పుడో కానీ అరుదుగా ఒకటి రెండు రోజులు పెరిగి ఆగిపోదు. ఇక ఈసారి ఏం జరుగుతుందో చూడాలి. నేడు 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు)పై రూ.100 పెరిగి రూ.53,950కి చేరుకోగా.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు)పై రూ.100 పెరిగి రూ.58,850కి చేరుకుంది. ఇక వెండి ధర కేజీపై రూ.500 తగ్గి రూ.71,400కి చేరుకుంది. నేడు దేశంలోని ప్రధాన నగరాల్లో వెండి, బంగారం ధరలపై ఓ లుక్కేద్దాం.