నాన్ వెజ్ ప్రియులకు గుడ్ న్యూస్..భారీగా తగ్గిన చికెన్ ధరలు

నాన్ వెజ్ ప్రియులకే కాదు సామాన్య ప్రజలకు సైతం ఇది తీపి కబురనే చెప్పాలి. ప్రస్తుతం కూరగాయల ధరలు కొండెక్కి కూర్చున్నాయి. టమాటా ఏకంగా కేజీ రూ.150 కి చేరింది. పచ్చి మిర్చి సైతం టమాటా తో పోటీపడుతోంది. ఇక మిగతా కూరగాయలు సైతం కేజీ రూ.100 , 80 పలుకుతున్నాయి. దీంతో కూరగాయలు కొనాలంటే సామాన్య ప్రజలు భయపడుతున్నారు. ఈ క్రమంలో చికెన్ ధరలు భారీగా తగ్గి కాస్త ఊపిరి పోశాయి.

రెండు నెలలుగా తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ధరలు కూడా ఆకాశానికి అంటాయి. దీంతో సామాన్య ప్రజలు తినాలంటేనే ఒకటికి రెండు సార్లు ఆలోచించుకునే పరిస్థితి ఏర్పడింది. ఓ వైపు ఎండలు పెరగడం, మరోవైపు కోళ్లకు వేసే దాణ రేట్లు పెరగడంతో చికెన్ ధరలు భారీగా పెరిగాయి. భారీగా నమోదైన ఉష్ణోగ్రతల కారణంగా ఫారంలోని కోళ్లు పెద్ద సంఖ్యలో చనిపోవడంతో ఉత్పత్తి తగ్గి.. డిమాండ్ పెరగడంతో కిలో చికెన్ రూ.330 నుంచి రూ.350 వరకు పలికింది.

Leave a Reply

%d