భవిష్యత్తు యువగళమే

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చేది తెలుగుదేశం ప్రభుత్వమేనని అన్నారు గుంటూరు పార్లమెంట్ తెలుగు మహిళా కార్యదర్శి ప్రియాంక. టిడిపి జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్ చేపట్టిన పాదయాత్రలో ఆమె పాల్గొన్నారు. రాష్ట్రంలో జగన్ పాలనతో ప్రజలు విసిగిపోయారని అన్నారు. ప్రజలు రాజకీయ మార్పు కోరుకుంటున్నారని పేర్కొన్నారు. ఇందుకు ప్రజల బాధలు, ఆలోచనలు తెలుసుకోవడానికి లోకేష్ పాదయాత్ర చేపట్టారని ఈ పాదయాత్రని మహిళా లోకం విజయవంతం చేస్తుందని అన్నారు. కనివిని ఎరగని రీతిలో ముగింపు సభ ఉంటుందని తెలిపారు.

Leave a Reply

%d