ఎన్టీఆర్ దిశలో తెలుగుదేశం పార్టీ ముందుకు వెళ్తుందన్నారు గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గ నాయకురాలు ప్రియాంక అన్నారు. స్వర్గీయ అన్న నందమూరి తారక రామారావు 27వ వర్ధంతి సందర్భంగా మోతడక గ్రామంలో అన్నగారి నూతన విగ్రహావిష్కరణ మరియు నూతన గ్రామ తెలుగుదేశం పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవ కార్య్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో మాజీ మంత్రివర్యులు పోలిట్ బ్యూరో సభ్యులు శ్రీ చింతకాయల అయ్యన్నపాత్రుడు గారు పాల్గొన్నారు. గుంటూరు జిల్లా టిడిపి అధ్యక్షులు తాడికొండ నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు తెనాలి. శ్రావణ్ కుమార్, పొన్నూరు నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు సంఘం డైరీ చైర్మన్ ధూళిపాళ్ల. నరేంద్ర కుమార్ , సత్తెనపల్లి నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు చలపతి విద్యాసంస్థల అధినేత వై.వి ఆంజనేయులు, తెలుగుదేశం పార్టీ యువ నాయకులు భాష్యం.ప్రవీణ్ , జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయ కార్యదర్శి సంఘం డైరీ డైరెక్టర్ కంచర్ల .శివరామయ్య గారు మరియు జిల్లా తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొనడం జరిగింది.
మోతడకలో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ
