తెలంగాణ ఐటీ కారిడార్ లో రూ.200 కోట్లతో హరేకృష్ణ టవర్

తెలంగాణలో గత కొంతకాలంగా భారీ నిర్మాణాలు రూపుదిద్దుకుంటున్నాయి. అంబేద్కర్ విగ్రహం, సచివాలయం ఈ కోవలోకే వస్తాయి. ఇవి ప్రభుత్వం నిర్మించింది. అయితే, హరేకృష్ణ మూవ్ మెంట్ ఆధ్వర్యంలో ఓ భారీ నిర్మాణం తెలంగాణలో చేపట్టనున్నారు.  తెలంగాణ ఐటీ కారిడార్ లో హరేకృష్ణ హెరిటేజ్ టవర్ నిర్మాణం జరపనున్నట్టు హరేకృష్ణ మూవ్ మెంట్ అధ్యక్షుడు సత్య గౌర చంద్ర దాస వెల్లడించారు. దీని వ్యయం రూ.200 కోట్లు అని తెలిపారు. కోకాపేట, నార్సింగి మధ్య ఉన్న గోష్పాద క్షేత్రంలో 6 ఎకరాల విస్తీర్ణంలో 120 మీటర్ల ఎత్తున దీన్ని నిర్మిస్తున్నట్టు వివరించారు.  ఈ హెరిటేజ్ టవర్ కు ఈ నెల 8వ తేదీన సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేస్తారని సత్య గౌర చంద్ర దాస వెల్లడించారు. కాగా, హరేకృష్ణ మూవ్ మెంట్ ప్రతినిధులు ఇటీవలే సీఎం కేసీఆర్ ను కలిసి హెరిటేజ్ టవర్ ఏర్పాటుపై వివరించారు.

Leave a Reply

%d