గర్నమెంట్ టీచర్ అక్రమ సంబంధం… ఓ మిస్డ్ కాల్

హైదరాబాద్ లోని హయత్ నగర్ లో ఈ యువకుడు హత్యకు గురైన విషయం తెలిసిందే. నాలుగు రోజుల కిందట నగ్నంగా ఓ మృతదేహం కుళ్లిపోయిన స్థితిలో కనిపించడంతో తీవ్ర కలకలం రేగింది.  స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. అనంతరం మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఆ తర్వాత ఘటనా స్థలంలో  దొరికిన కొన్ని వస్తువులను సైతం పోలీసులు స్వాధీనం చేసుకుని కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. అయితే, ఈ కేసుకు సంబంధించి పోలీసులు తాజాగా సంచలన నిజాలు బయటపెట్టారు. అసలేం జరిగిందంటే?

For More News Click: https://eenadunews.co.in/

పోలీసుల కథనం ప్రకారం.. వరంగల్ జిల్లాకు చెందిన రాజేష్ (23) అనే యువకుడు ఓ ఇంజనీరింగ్ కాలేజీలో పని చేసినట్లు తెలుస్తుంది. ఇతడు ఈ నెల 24న హైదరాబాద్ పరిసర ప్రాంతమైన ఇబ్రంహీపట్నంలో వివాహం ఉందని వచ్చాడు. ఆ తర్వాత స్నేహితులు, కుటుంబ సభ్యులు అతడికి సాయంత్రం ఎన్నోసార్లు ఫోన్ చేసినా స్పందించలేదు. చివరికి హయత్ నగర్ లోని ఓ నిర్మానుష్య ప్రాంతంలోని వేంచర్ గోడల మధ్య శవమై కనిపించాడు. ఈ విషయం తెలుసుకున్న మృతుడి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. మా కుమారుడుని చంపిన నిందితులను కఠినంగా శిక్షించాలంటూ డిమాండ్ చేశారు.

For More News Click: https://eenadunews.co.in/

ఈ కేసులో పోలీసుల ప్రాథమిక విచారణ తరువాత సంచలన నిజాలు బయటికి వచ్చాయి. హైదరాబాద్ లోని సుజాత అనే మహిళ ప్రభుత్వ టీచర్ గా పనిచేస్తుంది. ఓ మిస్డ్ కాల్ ద్వారా వీరిద్దరికి పరిచయం ఏర్పడింది. ఆమె వాట్సాప్ డీపీ చూసి పెళ్లి కాలేదని అనుకొని ఆమెతో పరిచయం పెంచుకున్నాడు. ఆ తర్వాత ఆమెతో నిత్యం ఫోన్ మాట్లాడడం, అది కాస్తా… అక్రమ సంబంధానికి దారి తీసింది. అయితే.. మూడు రోజుల ముందు సుజాత పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. దీంతో ఆమె భర్త వెంటనే నగరంలోని ఓ ఆస్పత్రిలో చేర్పించాడు. కానీ, ఫలితం లేకపోవడంతో సుజాత చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటనపై  సుజాత భర్త స్పందిస్తూ.. నా భార్యకు  రాజేష్ బలవంతంగా పురుగుల మందు తాగించాడని, అతని కారణంగానే సుజాత చనిపోయిందనే ఆరోపణలు చేశాడు. ఇంతలోనే  రాజేష్ హత్యకు గురి కావడం  పలు అనుమానాలకు తావిస్తుంది. ఇక పోలీసులు అనుమానంతో సుజాత భర్త నాగేశ్వర్ రావు, ఆయన బంధువులను అదుపులోకి తీసుకున్నారు.  ఇక విచారణ అనంతరం ఈ కేసు చిక్కుముడి వీడింది. రాజేష్, సుజాతల సంబంధం.. సుజాత కూతురికి తెలిసిపోయింది. ఇక సుజాత కొడుకు సైతం కొన్ని రోజుల ముందు రాజేష్ ని తన స్నేహితులతో కలిసి బాగా కొట్టిన నిజం బయటకి వచ్చింది. దీంతో.. పోలీసుల ప్రాథమిక విచారణలో మాత్రం.. రాజేష్ ను సుజాత కుటుంబ సభ్యులే అనుమానిస్తున్నారు. అయితే.. ఈ మొత్తం వ్యవహారంకి సుజాత- రాజేష్ సంబంధమే కారణం కావడం అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

Leave a Reply

%d bloggers like this: