ఢిల్లీ లిక్కర్ స్కాం అంశంపై సుప్రీం కోర్టులో భారస ఎమ్మెల్సీ కవితకు పెద్ద ఎదురు దెబ్బ తగిలింది. మద్యం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) తనకు సమన్లు జారీ చేయడాన్ని సవాల్ చేస్తూ భారాస ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన రిట్ పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. గతంలో దాఖలు చేసిన నళినీ చిదంబరం పిటిషన్‌కు ఈ కేసును ట్యాగ్ చేసిన సర్వోన్నత న్యాయస్థానం.. కేసు విచారణను 3 వారాలకు వాయిదా వేసింది. మహిళలను ఈడీ ఆఫీస్‌కు పిలిచి విచారణ జరిపే విషయంలో గతంలో నళినీ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై అత్యవసర విచారణ చేపట్టాలని ఆమె తరఫు న్యాయవాదులు 15న సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ ధర్మాసనం ముందు మెన్షన్ చేశారు. సీజేఐ అందుకు తిరస్కరించి ఈ నెల 24న విచారిస్తామని చెప్పారు. కానీ ఆరోజు కేసు విచారణకు రాలేదు. నేడు జస్టిస్ అజయ్‌రస్తోగి, జస్టిస్ బేలా ఎం.త్రివేది ధర్మాసనం ముందు లిస్ట్ చేయగా.. ధర్మాసనం విచారణ చేపట్టింది. మరో మూడు వారాల పాటు వాయిదా వేయడంతో కవిత ఆందోళన చెందుతున్నట్లు సమచారం. ఈ వ్యవధిలో మళ్లీ కవితను ఈడీ విచారణకు పిలిచే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.
కవితకు సుప్రీం కోర్టులో షాక్
