బతుకమ్మ చెరువుకు గండి

తెలంగాణలో పలు ప్రాంతాలను భారీ వర్షం అతలాకుతలం చేస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం నేడు హైదరాబాద్ సహా పలు జిల్లాలలో విద్యాసంస్థలకు సెలవు ప్రకటించింది. ఈ మేరకు ఆయా జిల్లాల కలెక్టర్లు ఆదేశాలు జారీ చేశారు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్ జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవులు ఇచ్చేశారు. ఇక మంగళవారం రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉరుములు మెరుపులతో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది. ఏడు జిల్లాలకు రెడ్ అలర్ట్, 17 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, 9 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

మెదక్ జిల్లా చిన్న శంకరంపేట మండలం ధరిపల్లి గ్రామంలోని బతుకమ్మ చెరువు గండి పడడంతో చెరువులోని నీరు దిగువ ప్రాంతానికి వెళ్తుంది. ధరిపల్లి, అచ్చంపేట గ్రామాల మధ్య ఈ చెరువు ఉండడంతో ప్రజలు ఆందోళన గురువుతున్నారు. గ్రామంలోని ఇతర చెరువులను గండి పడకుండా… అందులోని నీరుని దిగువ ప్రాంతానికి వదిలిపెట్లాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు. గ్రామంలోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. స్థానిక యువత అక్కడి చేరుకొని ప్రమాదం జరకుండా జాగ్రత్తలు చేపడుతున్నారు.

ఇక మరో వైపు ఆయా జిల్లాల వారిగా రెడ్, ఆరెంజ్, ఎల్లో అలెర్ట్ జారీ చేశారు.

రెడ్ అలర్ట్ జారీ అయిన జిల్లాలు: హైదరాబాద్, మెదక్, మేడ్చల్, మల్కాజిగిరి, రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి.

ఆరెంజ్ అలర్ట్: జగిత్యాల, జనగాం, జయశంకర్ భూపాలపల్లి, కామారెడ్డి, కరీంనగర్, మహబూబాబాద్, మంచిర్యాల, ములుగు, నారాయణపేట, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, వికారాబాద్, వరంగల్, హనుమకొండ.

ఎల్లో అలర్ట్: అదిలాబాద్, కుమురం భీం, జోగులాంబ, గద్వాల, ఖమ్మం, భద్రాద్రి, కొత్తగూడెం, నాగర్‌కర్నూల్, నల్గొండ, సూర్యాపేట, వనపర్తి.

Leave a Reply

%d bloggers like this: