కేంద్ర హోంమంత్రి అమిత్ షాను మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ కలిశారు. ఆస్కార్ అవార్డ్ వచ్చిన తర్వాత ఢిల్లీలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఆర్ఆర్ ఆర్ లోని నాటు నాటు సాంగ్ ఆస్కార్ గెలుచుకోవడం పట్ల అమిత్ షా అభినందించారు. రామ్ చరణ్ కు అమిత్ షా శాలువా కప్పి సన్మానించారు. కాసేపు చిరంజీవి, రామ్ చరణ్ తో మాట్లాడారు. ఢిల్లీలో ఇండియా టుడే చానల్ నిర్వహిస్తోన్న రెండు రోజుల సదస్సులో రామ్ చరణ్ పాల్గొంటారు. ఈ సదస్సుకు ప్రధాని మోడీ ముఖ్య అతిథిగా రానున్నారు. ప్రధాని మోడీతో కలిసి చరణ్ ఈ వేదికను పంచుకోనున్నారు. ఇటీవలే ఆర్ఆర్ఆర్ లోని నాటు నాటు సాంగ్ కు బెస్ట్ ఓరిజనల్ సాంగ్ కేటగిరిలో ఆస్కార్ అవార్డ్ వచ్చిన సంగతి తెలిసిందే. లాస్‌ఏంజెల్స్‌లో ఇటీవలే కీరవాణి చంద్రబోస్,ఆస్కార్ ను అందుకున్నారు. ఆర్ఆర్ఆర్ టీం కూడా లాస్ ఏంజెల్స్ నుంచి హైదరాబాద్ కు మార్చి 17న తిరిగి వచ్చింది.
అమిత్ షాను కలిసిన చిరంజీవి, రామ్ చరణ్ అందుకేనా
