గోపీచంద్ రామబాణం

హీరో గోపీచంద్, దర్శకుడు శ్రీవాస్‌ది హిట్ కాంబినేషన్‌. ఇద్దరి కలయికలో వచ్చిన లక్ష్యం, లౌక్యం మంచి విజయాలు సాధించాయి. ఈ ఇద్దరి కాంబినేషన్ లో తాజాగా వస్తున్న చిత్రం ‘రామబాణం’. టైటిల్ చివరన సున్నా వచ్చే సెంటిమెంట్ ను ఈ చిత్రంలోనూ కొనసాగించారు. ఈ చిత్రానికి సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ.. అన్ స్టాపబుల్ షో లో పేరు పెట్టారు. ఇందులో గోపీచంద్ సరసన డింపుల్ హయతి కథా నాయికగా నటిస్తోంది. జగపతి బాబు, ఖుష్బూ కీలక పాత్రలు పోషిస్తున్నారు. శివరాత్రి సందర్భంగా గోపీచంద్‌ ఫస్ట్ లుక్‌ వీడియోని విడుదల చేశారు.  విక్కీ మొదటి బాణం పేరుతో విడుదల చేసిన ఈ  వీడియోలో గోపీచంద్ తన మార్కు యాక్షన్ సీన్స్‌లో కనిపించారు. ఆయన కెరీర్‌‌లో ఇది 30వ చిత్రం కావడం విశేషం. దాంతో, ఏమాత్రం కాంప్రమైజ్ కాకుండా సినిమాను తెరకెక్కిస్తున్నారు నిర్మాతలు విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల. యాక్షన్ తో పాటు లక్ష్యం, లౌక్యం మాదిరి సున్నితమైన కామెడీ కూడా ఉండేలా చూస్తున్నారు దర్శకుడు శ్రీవాస్. ఈ సినిమాకు భూపతి రాజా కథను అందించారు. మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని వేసవి కానుకగా విడుదల చేయాలని చూస్తున్నారు.

Leave a Reply

%d