నాగచైతన్య ఆ హీరోయిన్ తో డేటింగ్ ?

గత కొంత కాలంగా నాగ చైతన్యతో తాను  డేటింగ్ లో ఉన్నానంటూ వినిపిస్తున్న  వార్తాలపై  స్పందించింది శోభిత ధూళిపాళ. తాజాగా పొన్నియన్  సెల్వన్2లో నటించిన ఆమె కెరీర్ లో మరో సూపర్ హిట్ ని తన ఖాతాలో వేసుకుంది. ఈ క్రమంలోనే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె.. తనపై వస్తున్న రూమర్స్ కి చెక్ పెటింది.

For More News Click: https://eenadunews.co.in/

‘నేను మంచి సినిమాలు చేస్తున్నాను. మణిరత్నం డైరెక్షన్‌లో ఇటీవలే పొన్నియన్‌ సెల్వన్‌ సినిమా చేశాను. ఇందులో ఏఆర్‌​ రెహమాన్‌ పాటలకు డ్యాన్స్‌ చేయడం అనేది ఒక అద్భుతమైన అనుభవం. ఇంత మంచి మధుర జ్ఞాపకాలు ఉన్నప్పుడు ఎవరో ఏదో అంటున్నారని దాన్ని పట్టించుకుని ఫీలైపోవాల్సిన అవసరం లేదు. ఆ రూమర్స్ తో నాకెలాంటి సంబంధం లేనప్పుడు, నేను ఏ తప్పూ చేయనప్పుడు క్లారిటీ ఇవ్వాల్సిన పనికూడా లేదు. నా పని నేను చేసుకుంటూ పోతాను’ అని చెప్పుకొచ్చింది శోభిత. ప్రస్తుతం ఆమె చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

For More News Click: https://eenadunews.co.in/

నిజానికి సినీ ఇండస్ట్రీలో రూమర్స్ కి కొదవ ఉండదు. నాగ చైతన్య, శోభిత ధూళిపాళపై కూడా ఇలాగే రూమర్స్ పుట్టుకొచ్చాయి.  ఓసారి లండన్‌ వెకేషన్‌లో, మరోసారి రెస్టారెంట్‌లో ఇద్దరూ జంటగా కనిపించడంతో ఆ రూమర్స్‌కు మరింత బలం చేకూరింది. సమంతతో విడిపోయిన తర్వాత చైకి శోభిత దగ్గరైందని, అందుకే వీరిద్దరూ జంటగా షికార్లు చేస్తున్నారని కథనాలు వినిపించాయి. ఇక తాజాగా శోభిత ఇచ్చిన క్లారిటీతో ఈ రూమర్స్ కి చెక్ పడింది.

Leave a Reply

%d bloggers like this: