మాస్ రాజా రవితేజ నటించిన రావణాసుర చిత్రం రేపు వరల్డ్ వైడ్ గా భారీ ఎత్తున విడుదల కాబోతుంది. ధమాకా , వాల్తేర్ వీరయ్య చిత్రాల సక్సెస్ తర్వాత రవితేజ నుండి వస్తున్న సినిమా కావడం తో అభిమానుల్లో ఈ మూవీ ఫై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. వారి అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా సినిమాను డైరెక్టర్ సుధీర్ వర్మ తెరకెక్కించినట్లు తెలుస్తుంది. కాగా మరికొద్ది గంటల్లో సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న తరుణంలో సినిమాలోని ఓ సీన్ లీక్ అయ్యి..ప్రస్తుతం సోషల్ మీడియా లో తెగ చక్కర్లు కొడుతుంది. ఈ సీన్ లో రవితేజ అమ్మాయిల గురించి చెప్పిన డైలాగ్ ఫై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. ‘కంచం ముందుకి.. మంచం మీదకి ఆడపిల్లలు పిలవగానే రావాలి.. లేకపోతే నాకు మండుద్ది.. దా..’ అంటూ బోల్డ్ అండ్ ఫైర్‌తో చెప్పిన ఆ డైలాగ్ నెట్టింట హల్‌చల్ చేస్తోంది. అయితే ఈ డైలాగ్ అభ్యంతరకరంగా ఉందని సోషల్ మీడియాలో అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. రవితేజ లాంటి స్టార్ హీరో అమ్మాయిల గురించి ఇలాంటి డైలాగ్ చెప్పడం కరెక్ట్‌గా లేదని.. ఇలాంటి డైలాగ్‌లకు సెన్సార్ బోర్డ్ ఎలా అనుమతి ఇచ్చిందని సోషల్ మీడియాలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ డైలాగ్ సినిమాలో ఉందా..లేదా అనేది రేపు సినిమా విడుదలైతే కానీ తెలియదు. సుధీర్ వర్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని అభిషేక్ నామా, రవితేజ లు నిర్మించారు. మేఘా ఆకాశ్ , అను ఇమ్మాన్యూయేల్ , పూజితా పొన్నాడ, ధక్షా నగార్కర్, ఫరియా అబ్దుల్లా హీరోయిన్స్ గా నటించారు. హర్షవర్ధన్ రామేశ్వర్ మరియు బీమ్స్ సంగీతం.
కంచం, మంచం అంటూ స్త్రీలపై హీరో రవితేజ
