హాస్పిటల్లో ఇలియానా ఎందుకంటే ?

‘దేవదాస్’ సినిమాతో సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన అందాల భామ ఇలియానా. టాలీవుడ్‌లోని స్టార్ హీరోలందరితో ఈ సుందరి సినిమాలు చేసింది. ‘పోకిరి’ , ‘జల్సా’ వంటి చిత్రాలతో ప్రేక్షకులను మెస్మరైజ్ చేసింది. అనంతరం బాలీవుడ్ నుంచి వరుసగా ఆఫర్స్ రావడంతో అక్కడే సినిమాలు చేసి స్థిరపడిపోయింది. తాజాగా ఈ గోవా సుందరి అస్వస్థతకు గురయింది. అందుకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది.

Ileana.jpg

ఆహారం కూడా తీసుకోలేని స్థితిలో ఇలియానా ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటుంది. ఈ నేపథ్యంలో ఆస్పత్రి బెడ్‌పై ఉన్న ఫొటోను ఫాలోయర్స్‌తో పంచుకుంది. చేతికి సెలైన్ బాటిల్ ఉన్న పిక్స్‌ను సోషల్ మీడియాలో షేర్ చేసింది. “ఒక్కరోజులో కాలం ఎంత మారిపోయింది. 3 సెలైన్ బాటిల్స్‌తో డాక్టర్స్ మధ్యలో ఉన్నాను. నా ఆరోగ్యం గురించి ఆరా తీస్తూ నాకు మెసేజ్ చేస్తున్న ప్రతి ఒక్కరికీ నా ధన్యవాదాలు. మీ ప్రేమకు ఏమిచ్చినా రుణం తీరదు. సరైన సమయంలో సరైన వైద్యం అందడంతో ప్రస్తుతం నా ఆరోగ్యం బాగానే ఉంది’’ అని ఇలియానా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. ఇలియానా అస్వస్థత బారిన పడిందని తెలియడంతో ఆమె త్వరగా కోలుకోవాలని ఆశిస్తూ అభిమానులు పోస్ట్‌లు పెడుతున్నారు. ఇలియానా ఆరోగ్యం గురించి సోషల్ మీడియాలో రకరకాల వార్తలు ప్రచారం అవుతుండటంతో ఆమె తల్లి స్పందించింది. ఇలియానాకు ఫుడ్ పాయిజన్ అయిందని చెప్పింది. అందువల్ల డీ హైడ్రేషన్‌కు గురయిందని పేర్కొంది. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం బాగానే ఉందని తెలిపింది. ఇక కెరీర్ విషయానికి వస్తే.. ఇలియానా చివరగా బిగ్‌బుల్ (The Big Bull) లో నటించింది. జర్నలిస్ట్ సుచేతా దలాల్ పాత్రను పోషించింది. ప్రస్తుతం ఆమె చేతిలో రెండు ప్రాజెక్టులున్నాయి.

Leave a Reply

%d