ఆర్ ఎక్స్ 100 హీరోయిన్ని ఆ దర్శకులు వాడుకున్నారంట

‘ఆర్‌‌ఎక్స్‌100’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది పాయల్ రాజ్‌పుత్. తర్వాత వరుసగా సినిమాలు చేసింది కానీ.. తొలి సినిమాలా విజయాలు సాధించలేదు. వెంకటేశ్, రవితేజ వంటి హీరోలతో నటించినప్పటికీ పెద్దగా క్రేజ్ రాలేదు. ఈ నేపథ్యంలో ఐదేళ్ల తన సినీ కెరియర్‌‌లో ఎదురైన అనుభవాల గురించి ఈ పంజాబీ హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు చేసింది.  ఒక యూట్యూబ్ చానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో పాయల్ మాట్లాడుతూ.. ఈ చిత్ర పరిశ్రమలో తనని కొంతమంది తప్పుదోవ పట్టించారని చెప్పింది. ‘‘ఆర్ఎక్స్ 100 సినిమా విజయం తర్వాత నేనొక్కదాన్నే హైదరాబాద్‌లో ఉన్నా. దీంతో కొంతమంది అడ్వాంటేజ్ తీసుకున్నారు. నన్ను మిస్ గైడ్ చేశారు. కొంతమంది దర్శకులు తప్పుదోవ పట్టించి, నన్ను వాడుకున్నారు” అని చెప్పింది.
ఇప్పుడు బాగా అలోచించి నిర్ణయాలు తీసుకుంటున్నానని పాయల్ తెలిపింది. ఎలాంటి సినిమాలు చెయ్యాలో బాగా అలోచించిన తర్వాతే సంతకం చేస్తున్నానని చెప్పింది. వెంకటేశ్ చాలా మంచి మనిషి అని, ఆయనతో చెయ్యడం చాలా సంతోషంగా వుందని, మళ్లీ వచ్చినా చేస్తానని వివరించింది.  ‘‘ఈ పరిశ్రమలో టాప్ లోకి వెళ్తాం.. అలానే కిందికీ పడిపోతాం. కానీ తట్టుకొని నిలబడాలి. నెగటివిటీని వదిలేసి, పాజిటివ్ గా ముందుకు వెళ్తున్నా” అని చెప్పుకొచ్చింది. తనకు తొలి సినిమాలో అవకాశం ఇచ్చిన అజయ్ భూపతి డైరెక్షన్‌లోనే ‘మంగళవారం’ అనే సినిమా చేస్తోంది పాయల్.

Leave a Reply

%d bloggers like this: